ఆస్ట్రేలియాలో మిర్చి మసాలా!
'ఆస్ట్రేలియాలో ఉదార స్వభావంగలవారు అనేక మంది ఉన్నారు. భారతీయ విద్యార్థులపై జాత్యహంకార దాడులను 'ఆస్ట్రేలియన్ తత్వానికి విరుద్ధమైనవి'గా వారు భావిస్తున్నారు' అని ఆయన ఆస్ట్రేలియన్ ప్రవీణుని చొరవను ప్రస్తావిస్తూ తెలియజేశారు. ఈ ప్రతిపాదనకు విద్యార్థుల నుంచి 'అద్భుతమైన మద్దతు' లభించిందని, ఈ శిక్షణ తరగతులలో మొదటిది రెండు వారాలలోగా ప్రారంభం కాగలదని గుప్తా తెలిపారు.
మరి ఇటువంటి ఆత్మరక్షణ చర్యలను, తరగతులను ఆస్ట్రేలియన్ అధికారులు 'చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం'గా పరిగణిస్తారేమోననే ప్రశ్నకు గుప్తా సమాధానం ఇస్తూ, విద్యార్థులకు 'మరే మార్గమూ లేకపోతున్నది' అని చెప్పారు. ఏమైనా విక్టోరియా రాష్ట్రంలో పోలీసులు ప్రతి ఒక్క విద్యార్థిని కాపాడేందుకు తగినంత మంది పోలీసు సిబ్బంది లేనందున 'ఆత్మరక్షణ పద్ధతులను అనుసరించవలసిందిగా' విద్యార్థులకు సూచించారని ఆయన తెలిపారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని విద్యార్థులను ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్ రూడా ఇటీవల హెచ్చరించారు.
భారతీయ విద్యార్థులు నివసించే స్వల్పాదాయ వర్గాల నివాస ప్రాంతాలలోను, చదువు, ఉద్యోగం అనంతరం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత ఇంటికి తిరిగి వచ్చేందుకు ఉపయోగించే మెట్రో రైల్ సర్వీసులలోను జాగిలాల బృందాలతో సహా రాత్రి పహరాను పోలీసులు ముమ్మరం చేశారు.
Pages: -1- 2 News Posted: 14 June, 2009
|