ఫలించని టైగర్ వ్యూహం
కాంగ్రెస్ అంత శత్రుత్వంతో తృతీయ ఫ్రంట్ లేదా ఎన్ డిఎ ఉండవని ఎల్ టిటిఇ అధినేత భావించాడని, యుద్ధ ప్రాంతం నుంచి జనం నిష్క్రమించడం ప్రారంభించడంతో శ్రీలంక సైన్యం వెంటనే పౌరులను కాపాడి సురక్షిత ప్రదేశాలకు తరలించిందని వారు తెలిపారు. తృతీయ ఫ్రంట్ లో భాగస్వామ్య పక్షమైన ఎఐఎడిఎంకె పార్టీ అధినేత్రి జయలలిత శ్రీలంక తమిళుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. తాము కోరుకున్న ప్రభుత్వం కేంద్రంలో వచ్చినట్లయితే శ్రీలంకలో తమిళ ఈళం ఏర్పాటు కోసం భారతీయ సైన్యాన్ని పంపగలమని ఆమె వాగ్దానం కూడా చేశారు.
తమ సంస్థ ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా ఎల్ టిటిఇ అంతర్జాతీయ సంబంధాల విభాగం అధిపతి సెల్వరాస పద్మనాథన్ మే 16 మధ్యాహ్నం ఒక ప్రకటన విడుదల చేశారు. 'వణ్ణి ప్రజలను ప్రపంచ దేశాలు కాపాడాలి' అని పద్మనాథన్ తన ప్రకటనలో కోరారు.
శ్రీలంక సైనిక దళాలు తనను, తన అనుచరులను 'అంత త్వరగా' చుట్టుముట్టగలవని ప్రభాకరన్ ఊహించలేదని తమిళ సంస్థ ప్రతినిధులు తెలిపారు. శ్రీలంక నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడిన ఎల్ టిటిఇ సీ టైగర్స్ దళం అధిపతి సూసై భార్య ద్వారా సైనిక దళాలు ప్రభాకరన్, ఆ సంస్థ ఇతర అగ్రనేతలు యుద్ధ ప్రాంతంలోనే ఇంకా ఉన్నారని తెలుసుకున్నారు. 'దీనితో సైన్యం ధైర్యం చేసి మే 16న వణ్ణి ప్రాంతంలో రెండు చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉన్న టైగర్లను చుట్టుముట్టింది. టైగర్ నాయకులు ఎవరికీ తప్పించుకునేందుకు మార్గం లేకపోయింది' అని ఆ ప్రతినిధులు వివరించారు.
Pages: -1- 2 News Posted: 14 June, 2009
|