ఫీజులు దింపనున్న యుజిసి
వాటి అడ్మిషన్లను, ఫీజులను నియంత్రించేందుకు యుజిసి ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది. ఈ వ్యూహంపై ఈ నెల 22న తుది చర్చలు జరుగుతాయి. అడ్మిషన్లకు సంబంధించినంత వరకు అవి తమ విద్యార్థులలో 80 శాతం మంది వరకు ప్రస్తుత అఖిల భారత ఇంజనీరింగ్ వైద్య ప్రవేశ పరీక్షల నుంచి ఎంపిక చేసుకోవాలని, లేదా సొంత పరీక్ష విధానాన్ని ప్రారంభించాలని థొరాట్ సూచించారు. మిగిలిన 20 శాతం సీట్లను మేనేజ్ మెంట్ కోటాలో కాపిటేషన్ ఫీజుతో లేదా ఏ ఇతర పద్ధతిలోనైనా తమ అభీష్టానుసారం భర్తీ చేసుకోవచ్చునని ఆయన సూచించారు. ఫీజు నిర్థారణకు సంబంధించిన ఒక ప్యానెల్ కమిషన్ కు ఈ సిఫార్సు చేసింది.
ఇక ఫీజుకు సంబంధించి, ఇదే ప్యానెల్ చేసిన సిఫార్సు ఏమిటంటే రాష్ట్ర స్థాయి ఫీజు నిర్థారణ కమిటీల పరిధిలోకి లేదా కొత్త అఖిల భారత స్థాయి కమిటీ పరిధిలోకి రావలసిందిగా డీమ్డ్ విశ్వవిద్యాలయాలను కోరాలి. అయితే, 'అటువంటి నియంత్రణ చట్టం దృష్టిలో సరైన చర్య కాదు' అని మణిపాల్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ రామదాస్ ఎం. పాయి వ్యాఖ్యానించారు. 'ప్రభుత్వం నియంత్రణకు పూనుకోవడానికి బదులు ఒక కమిటీ ద్వారా అడ్మిషన్లను, ఫీజులను పర్యవేక్షించవచ్చు' అని ఆయన సూచించారు. మితిమీరిన ప్రభుత్వ నియంత్రణ అవినీతికి దారి తీస్తుందని, ఇది ప్రైవేట్ విద్యా సంస్థలకు చేటు కాగలదని భారతీయ విద్యాపీఠ్ వైస్ చాన్స్ లర్ శివాజీరావు శ్రీపతిరావు కదమ్ అభిప్రాయం వెలిబుచ్చారు.
ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజులను, అడ్మిషన్లను నియంత్రించడానికి ప్రభుత్వం ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. ప్రైవేట్ సంస్థలలో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి రూపొందించిన బిల్లులో అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణకు సంబంధించి ఒక అధ్యాయాన్ని హెచ్ఆర్ డి మంత్రిత్వశాఖ పొందుపరిచింది. డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రొఫెషనల్ కాలేజీల నుంచి తీవ్ర ప్రతిఘటన రావడంతో ప్రభుత్వం ఆ బిల్లును రద్దు చేసింది.
Pages: -1- 2 News Posted: 15 June, 2009
|