యూత్ బ్రిగేడ్ ఎఐసిసి ఆశలు
అయితే, అనుభవజ్ఞులు, యూత్ బ్రిగేడ్ మధ్య సమతూకం పాటించేట్లు చూడడమే ప్రధాన సమస్య అని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. 'పలువురు సీనియర్లను మంత్రివర్గంలో చేర్చుకున్నారు. వారిలో కొందరు పార్టీకి ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తుంటారు. మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరగనున్నందున పార్టీకి వారి అవసరం చాలా ఉంది' అని కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పారు.
పార్టీ యంత్రాంగంలో మార్పులు చేర్పులు చేయడం అంత తేలికైన పని కాదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. మంత్రివర్గంలో చోటు దొరకని సీనియర్ నాయకులు ఎఐసిసిలో తమకు స్థానం కల్పించాలని కోరుతున్నారు. ఇక ఎన్నికలలో ఓడిన మార్గరెట్ ఆల్వా, షకీల్ అహ్మద్, మణిశంకర్ అయ్యర్ వంటి నాయకులు ఉన్నారు. ఈ దఫా మంత్రివర్గంలో స్థానం కల్పించని ఆస్కార్ ఫెర్నాండెజ్ తో పాటు ఆ ముగ్గురికీ ఎఐసిసిలో పదవులు కేటాయించవచ్చునని భావిస్తున్నారు.
సుమారు 13 మంది గవర్నర్ల పదవీ కాలం డిసెంబర్ లో ముగియనుండడంతో మంత్రి పదవులు ఇవ్వని పార్టీ వెటరన్లకు గవర్నర్ పదవులను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి ఇవ్వజూపవచ్చు. గవర్నర్ పదవులు ఇవ్వవచ్చునని భావిస్తున్న నాయకులలో అర్జున్ సింగ్, హన్స్ రాజ్ భరద్వాజ్, శివరాజ్ పాటిల్, శీశ్ రామ్ ఓలా కూడా ఉన్నారు. అయితే, వెటరన్లు 'ఏదో రాజ్ భవన్ కు వెళ్ళి రిటైర్డ్ జీవితం సాగించడానికి' అంగీకరించకపోవచ్చునని సీనియర్ ఎఐసిసి నాయకుడు ఒకరు అభిప్రాయం వెలిబుచ్చారు.
Pages: -1- 2 News Posted: 16 June, 2009
|