తెరాసపై క్రీనీడలు!
వైష్ణవాలయం అయినా, మరే ఆలయం అయినా అవి ఉన్న ప్రాంతంలో పక్కనే ఉండే నివాసాలు, కార్యాలయాలు లాంటి వాటిపై ఆలయ గోపురం నీడలు పడటం అరిష్టం అని సాధారణ గ్రామ స్థాయినుంచీ విశ్వాసం ఉంది. అందుకే ఈశ్వరుడి ఆలయం నిర్మాణం జరిగినప్పుడు ఎదురుగా ఉండే ఇళ్ళపై త్రినేత్రుడి ప్రభావం పడకుండా గర్భాలయం ఎదురుగా ధ్వజస్తం భాన్ని, అంతకు ముందు నందీశ్వర విగ్రహాన్నీ ప్రతిష్ఠిస్తారు.
టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు జాతకాలపై అపార విశ్వాసం. ఏ పనీ శకునం చూడకుండా ఆయన చేయరు. ప్రయాణం చేయాలన్నా ముందు ఈశాన్య దిశలో ఉండే ప్రాంతానికే వెళ్తారు. మహాకూటమిలో చేరే ముందు ఆయన టిఆర్‌ఎస్ కార్యాలయ ప్రాంగణంలో అపూర్వ విశ్వశాంతి యాగాన్ని 25 రోజుల పాటు భారీ ఖర్చుతో నిర్వహించారు. ఆ యాగ నిర్వహణ బాధ్యత తలకెత్తుకున్న సంఖ్యా శాస్త్ర వేత్త నారాయణ రమణారావుపై కేసీఆర్‌కు మంచి గురి.
ఆయన ఎంత చెబితే అంత. అంత సాన్నిహిత్యం ఉన్న రమణారావు ఈ మధ్య కనిపించటమే మానేశారు. తమ నేత ఇన్ని కష్టాలలో ఉన్నప్పుడు నారాయణ సిద్ధాంతి ఏ మూలన దాక్కున్నారో, ఎందుకు రావటం లేదో తెలియదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కెసిఆర్‌కు బ్రహ్మాండమైన రాజయోగం ఉందని, ఆయన అన్నదల్లా సిద్ధిస్తుందని సిద్ధాంతి యాగం సందర్భంగా చెప్పారు. రాజయోగం సంగతేమో కాని పార్టీ అస్తిత్వ యోగానికే ప్రమాదం ముంచుకు వచ్చి, ఓటముల పరంపర ఎదురవుతుంటే ఎందుకిలా అయిందో తెలుసుకుందామంటే సిద్ధాంతి చిరునామా ఎంత ప్రయత్నించినా దొరకటం లేదని నేతలు చెప్పుకుంటున్నారు.
Pages: -1- 2 News Posted: 16 June, 2009
|