వైఎస్ఆర్ ముందు చూపు
కొన్ని తెలుగు దిన పత్రికలపై బాహాటంగా తాను చేసిన విమర్శలు సందేహాస్పదమైన, అవినీతి కార్యకలాపాలకు ఒడిగట్టేందుకు కొంత మంది కాంగ్రెస్ నాయకులకు ఏవిధంగా ధైర్యం కలిగించాయో ముఖ్యమంత్రికి ఆ సన్నిహిత సహచరులు వివరించినట్లు తెలుస్తున్నది. కొన్ని పత్రికలలో ప్రచురితమైన వార్తలు వేటినీ ముఖ్యమంత్రి విశ్వసించబోరనే నమ్మకంతో వారు (కాంగ్రెస్ నాయకులు) ప్రజా జీవితంలో విలువలకు స్వస్తి చెప్పారు. మీడియాలో అటువంటి వ్యతిరేక వార్తలు వెలువడినప్పుడు నిజానిజాలను నిర్థారించుకుని చర్య తీసుకోవడానిైక ప్రైవేట్ గూఢచారి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా వైఎస్ యోచిస్తున్నారు.
ఒక సంవత్సరంలోగా ఎన్నికలు జరగనున్న మునిసిపాలిటీలలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పట్ల అధికార కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. మంచినీటి సరఫరా లేదా పారిశుద్ధ్యం లేదా ఇతర మౌలిక పౌర సదుపాయాల విషయంలో కొన్ని సంవత్సరాలుగా పని తీరు ఏమాత్రంగా సంతృప్తికరంగా లేదని పార్టీ భావిస్తున్నది. పురపాలక సంస్థలలో అధిక సంఖ్యాకం కాంగ్రెస్ పాలనలోనే ఉన్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఆ పట్టణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి పడిన వోట్ల శాతం సంతృప్తికరంగా లేదు. తక్షణం ఈ పరిస్థితిని చక్కదిద్దుతూ చర్యలు తీసుకోకపోతే ఆ పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ వ్యతిరేకత మరింత ప్రబలుతుందని వైఎస్ కు సన్నిహిత సహచరులు సూచించారు.
డాక్టర్ రాజశేఖరరెడ్డి ఒకటికి రెండుసార్లు బాహాటంగా ప్రకటించినట్లుగానే ఎన్నికల ఫలితాల పట్ల ఆయన ఏమాత్రం ఆనందంగా లేరు. ఎందుకంటే అధికార పార్టీకి, ప్రతిపక్షానికి మధ్య సీట్ల తేడా కేవలం 20కి తగ్గిపోయింది. ఇప్పుడు ఆయన చేయవలసిందేమిటంటే చంద్రబాబు నాయుడు చేసిన పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకుని అవి పునరావృతం కాకుండా చూడడం. అలా జరగకపోతే చంద్రబాబు వలె వైఎస్ కూడా పతనం కాక తప్పదు.
Pages: -1- 2 News Posted: 17 June, 2009
|