'తప్పు' ఒప్పుకున్న షైనీ
కాగా, పోలీసులు మంగళవారం ఆ నటుడి ఇంటిలో పని చేసే మరొక యువతి వాఙ్మూలాన్ని కూడా నమోదు చేశారు. అహుజా 'మంచి వ్యక్తి' అని ఈమె అభివర్ణించింది. ఆ సంఘటన జరగడానికి దాదాపు రెండు గంటల ముందు ఇల్లు వదలి వెళ్ళిన ఈమె నటునికి అనుకూలంగానే వాఙ్మూలం ఇచ్చినట్లు తెలుస్తున్నది. 'నేను తప్పు చేశాను. కాని యువతి సమ్మతితోనే ఆ పని చేశాను' అని అహుజా పోలీసులతో చెప్పినట్లు దర్యాప్తు అధికారి ఒకరు తెలియజేశారు.
అయితే, అహుజా అత్యాచారం జరిపాడని నిరూపించేందుకు తగిన ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయని ఆ అధికారి చెప్పారు. అక్రమంగా నిర్బంధించినందుకు, చంపుతానని బెదరించినందుకు కూడా అహుజాను అరెస్టు చేశారు. జరిగినదానికి నటుడు విచారం వెలిబుచ్చి యువతి అంగీకారంతోనే సెక్స్ జరిపినట్లుగా తనను ప్రశ్నించిన పోలీసు సిబ్బందితో చెప్పాడు. మరి అత్యాచారం జరిపినట్లుగా బాధితురాలు ఎందుకు ఫిర్యాదు చేసిందనే ప్రశ్నకు అతను సమాధానం ఇవ్వలేదని పోలీసులు చెప్పారు. ఆ యువతి ఎందుకు కేసు దాఖలు చేసిందని పోలీసులు ప్రశ్నించినప్పుడు 'నాకు తెలియదు' అని అహుజా సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు.
'పోలీస్ ఆసుపత్రి నుంచి వైద్య నివేదిక మాకు అందింది. ఎఫ్ఐఆర్ కు అది బలం చేకూరుస్తున్నది. బాధితురాలి వయస్సు 17, 18 సంవత్సరాల మధ్య ఉంటుందని కూడా నివేదిక సూచిస్తున్నది. ఆమె వయస్సు ఎంతో కచ్చితంగా తెలుసుకునేందుకు మేము వయస్సు నిర్థారణ పరీక్ష నిర్వహించబోతున్నాం' అని జోనల్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ (డిసిపి) నికేత్ కౌశిక్ చెప్పారు.
ఆ యువతి ఆదివారం సాయంత్రం పోలీసులకు వాఙ్మూలం ఇస్తూ భోరుమని విలపించినట్లు తెలుస్తున్నది. ఆమె పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు ఆమె వెంట కుటుంబ సభ్యులు ఒకరు ఉన్నారు. అహుజా ఇంటిలో యువతిని పనికి కుదిర్చిన మహిళ ఆ సంఘటన అనంతరం ఆమెను ఆ కుటుంబ సభ్యుల ఇంటికి తీసుకువెళ్ళింది.
Pages: -1- 2 News Posted: 17 June, 2009
|