కాంగ్రెస్ కు జార్జి అభ్యర్థన
జార్జి ఫెర్నాండెజ్ కు ఢిల్లీలో ఇల్లు లేదని కాదు. ఆయనకు హౌజ్ ఖాస్ ప్రాంతంలో నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి. 1984 లోక్ సభ ఎన్నికలలో బెంగళూరు నార్త్ నియోజకవర్గంలో జార్జి ఓడిపోయినప్పుడు మునిసిపల్ మజ్దూర్ యూనియన్, బొంబాయి లేబర్ యూనియన్ ఆయన కోసం కొన్న ఫ్లాట్లు అవి. ఆయన 1985 - 89 కాలంలో వాటిలో ఒక ఫ్లాట్ లోకి మారారు. ఆరు నెలల తరువాత గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్లలో ఒకదానిలోకి మారవచ్చు. ఆయన సన్నిహిత మిత్రురాలు జయా జైట్లీ ఆ ఫ్లాట్లలో ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తూ ఒక పత్రికను వెలువరిస్తున్నారు.
జార్జికి దూరమైన భార్య లైలా కబీర్ అభిప్రాయం ప్రకారం, తానేమీ చేస్తున్నానో నిజంగా తెలిస్తే వాటిలో సగం పనులను జార్జి చేయరు. 'ఆ భవనంలో తాను నివసించడానికి మరింత గడువు ఇవ్వవలసిందని విజ్ఞప్తి చేయడం వాటిలో ఒకటి. ఆయన దానిని తన కోసం చేయడం లేదు. ఆయన చుట్టూ చేరినవారు తమ కోసం ఆయన ద్వారా అలా చేయించుకుంటున్నారు' అని లైలా అన్నారు. ఆమె మన దేశ తొలి విద్యా శాఖ మంత్రి హుమాయూన్ కబీర్ కుమార్తె.
'1995లో తలకు తగిలిన గాయం, తరువాత మూడు శస్త్రచికిత్సల వల్ల ఆయన చాలా బలహీనులయ్యారు. ఎన్ డిఎ ప్రభుత్వంలో మంత్రిగా తన బాధ్యతలను ఆయన పరిపూర్తి చేయగలగడం విశేషం' అని ఆమె పేర్కొన్నారు. 2009లో ఎన్నికల బరిలోకి జార్జి దిగడాన్ని లైలా, ఆయన సోదరులు ఇష్టపడలేదు. కాని జార్జి ఇందుకు ఏమీ చింతించడం లేదు. పార్లమెంట్ ను 'మిస్' అవుతున్నారా అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, 'నాకు సంబంధించినంత వరకు రాజకీయాలు పార్లమెంట్ లో కాకుండా ప్రజలతో సంబంధాలు కలిగి ఉండడంలోను, వారి కోసం పని చేయడంలోను ఉంటాయి. నేను అలా చేస్తూనే ఉంటాను' అని చెప్పారు.
ప్రతి ఉదయం ఆయన ఒక రీసర్చ్ స్కాలర్, రచయితతో కలసి ఆత్మకథపై రెండు గంటలు వెచ్చిస్తుంటారు. ఆయన 42 పేజీలు పూర్తి చేశారు. ఆయన జ్ఞాపక శక్తి బాగుందని ఆయన సహాయకుడు ఒకరు చెప్పారు.
జార్జి 1960 దశకంలో మంగళూరులో ఒక సెమినరీతో సంబంధాలు తెంచుకుని ముంబై చేరుకున్నారు. ఆయన పట్టు వదలని ట్రేడ్ యూనియన్ నాయకుడుగా మారారు. 1967 లోక్ సభ ఎన్నికలలో దక్షిణ ముంబై నియోజకవర్గంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఎస్.కె. పాటిల్ ను ఓడించిన తరువాత, 1974లో దేశవ్యాప్తంగా రైల్వే సమ్మెకు పిలుపు ఇచ్చిన తరువాత జార్జి జాతీయ స్థాయిలో ప్రముఖ స్థానం ఆక్రమించారు. మత విశ్వాసాలు ఏవీ లేని జార్జి ఫెర్నాండెజ్ చాలా సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారిగా 2008లో క్రిస్మస్ రోజు మంగళూరులో ఒక చర్చికి వెళ్ళారు.
Pages: -1- 2 News Posted: 17 June, 2009
|