మల్లోజులే లాల్‌గఢ్ కిషన్‌జీ!
1983లో తొలిసారిగా రాష్ట్ర మావోయిస్టు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. అంతకు ముందు ఆయన తన సొంత ప్రాంతమైన పెద్దప ల్లితో పాటు రాష్ట్రంలోని పలు ఏరియాలకు నాయకత్వం వహించాడు. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో గడుపుతూ ఏ నాడు స్వ గ్రామానికి వెళ్లలేదు. తండ్రి చనిపోయినపుడూ వెళ్లలేదు. తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు కావడంతో, ఆ పోరాట పటిమ ఇతనికి వచ్చిందని ఆయన సన్నిహితులు చెప్పేవారు. ఇతను ఎక్కువగా భూస్వాముల కు వ్యతిరే కంగా పోరాటం చేస్తూ, వారి భూములను పేదలకు దక్కేలా ఉద్యమాలు చేపట్టాడు. సాయిధ దళాలను పటిష్టపర్చడంలో ఈయన ముఖ్య పాత్ర పోషించారు. మల్లోజుల సోదరుడెైన వేణుగోపాల్‌రావు కూడా మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడు.
ప్రస్తుత మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్‌రావు ఆలియాస్ గణపతి ఈయన ఆధ్వ ర్యంలోనే పార్టీలో చేరినట్లు చెబుతుంటారు. ప్రస్తుతం మల్లోజుల కోటేశ్వర్‌రావు మావోయిస్టు ప్రొవెన్షియల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తూ, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాలకు ఇంఛార్జీగా వ్యవహరి స్తున్నాడు. ఈయన పశ్చిమబెంగాల్ మావోయిస్టు ఉద్యమంలో ఈ కోటీశ్వరావు కిషన్‌జీగా ప్రసిద్ధుడు.
Pages: -1- 2 News Posted: 19 June, 2009
|