ఒకే జైలులో షైనీ, సాలెం
అహుజా పాత్ర సాలెంను పోలి ఉన్నదని నిజజీవిత గూండా తరఫు న్యాయవాదులు పేర్కొనగా, చిత్ర దర్శకుడు మహేష్ భట్ ఆ వాదనను ఖండించారు. సాలెం నేర జీవితానికి గాని, బాలీవుడ్ అందాల నటి మోనికా బేడితో అతని సరస సల్లాపాలకు గాని తాను చిత్ర రూపం ఇవ్వలేదని మహేష్ భట్ స్పష్టం చేశారు. కాని ఆయన మాటలను విశ్వసించినవారు ఎక్కువ మంది లేరు. అయితే, చివరకు సాలెం న్యాయవాదులు తమ అభ్యంతరాలను ఉపసంహరించుకున్నారు. 'గ్యాంగ్ స్టర్' చిత్రం కొంత కాలం పాటు థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడిచింది.
మరి షైనీ అహుజాను ఆర్థర్ రోడ్ జైలు సముదాయంలోనే నిర్బంధంలో ఉంచుతారా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదు. కాని అతను, సాలెం పరస్పరం తారసపడే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి. కిక్కిరిసిపోయి ఉన్న ఆ జైలులో ఖైదీలకు తరచు ఎక్కడో ఒక చోట పరస్పరం మాట్లాడుకునే అవకాశం కలుగుతూ ఉంటుందని జైలు వర్గాలు చెప్పాయి.
పోర్చుగల్ అధికారులు అప్పగించిన వెంటనే అబూ సాలెంను జైలులో పేరొందిన 'అండా సెల్'లో నిర్బంధంలో ఉంచారు. (కోడిగుడ్డు ఆకారంలో ఉండే సెల్ ఇది. సంచలనాత్మక కేసులతో ప్రమేయం ఉన్న ఖైదీలను జైలులోని ఇతర ఖైదీలకు దూరంగా ఇదే సెల్ లో నిర్బంధంలో ఉంచుతుంటారు.) అయితే, సాలెంను ఇప్పుడు ఇతర సాధారణ ఖైదీ వలె బ్యారక్ లోనే నిర్బంధంలో ఉంచుతున్నారు.
Pages: -1- 2 News Posted: 19 June, 2009
|