లాల్ గఢ్ బాటలో కోరాపుట్!
సంఘ్ లోని ప్రధాన స్రవంతి నాయకులు శనివారం ఒక సదస్సు నిర్వహించారు. కాని నారాయణపట్నకు చెందిన తీవ్రవాద శక్తులు దానికి హాజరు కాలేదు. వారిలో ఒకరైన, 30 దశకంలో ఉన్న గిరిజనుడు నాచిక లింగ్ రాడికల్స్ కు సారథ్యం వహిస్తున్నట్లు తెలుస్తున్నది. మావోయిస్టులు వస్తున్నది ఈ ప్రాంతం నుంచే. వారు లింగకు ప్రధాన మద్దతుదారులు అని తెలుస్తున్నది. ఈ ప్రాంతానికి ఈ విషయంలోనే లాల్ గఢ్ తో సామ్యం కనిపిస్తున్నది. లాల్ గఢ్ లో పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్థానికుల కమిటీ మావోయిస్టుల సాయంతో రాష్ట్ర ప్రభుత్వంతో సమరానికి దిగారు.
'సిఎంఎఎస్ లో తీవ్ర స్వభావం కలవారు సంస్ధపై ఆధిపత్యం వహించాలని మావోయిస్టులు కోరుకుంటున్నారు. దీని వల్ల లాల్ గఢ్ లో నక్సల్స్ చేసినట్లుగా గిరిజన ఉద్యమానికి వారు మార్గదర్శకత్వం వహించవచ్చు' అని పేరు వెల్లడికి ఇష్టపడని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
'లింగ మావోయిస్టులతో కుమ్మక్కయ్యాడు' అని కోరాపుట్ ప్రాంతం డిఐజి సంజీవ్ పాండా 'హిందుస్థాన్ టైమ్స్' పత్రిక విలేఖరితో చెప్పారు. 'అతనిని అరెస్టు చేసి రెండు మూడు సంవత్సరాల పాటు జైలుకు పంపారు. తరువాత అతనిని బెయిలుపై విడుదల చేశారు' అని ఆయన తెలిపారు.
లింగ, అతని గ్రూపు వందలాది ఎకరాల భూములను బలవంతంగా ఆక్రమించుకుని వాటిని గిరిజనులకు అప్పగించారు. 'భూ కబ్జాదారులుగా' పేర్కొంటున్న వ్యక్తులకు చెందిన సుమారు వంద ఇళ్ళను కూడా ఆ గ్రూపు ధ్వంసం చేసింది.
లాల్ గఢ్ లో వలె కాకుండా రాష్ట్ర పాలనా యంత్రాంగం ఈ ప్రాంతాన్ని వదలుకోలేదు. 'ప్రస్తుతం 100 మంది సిఆర్ పిఎఫ్ సిబ్బందిని, దాదాపు 30 మంది భారత రిజర్వ్ బెటాలియన్ సిబ్బందిని, ఒక ఒఎస్ఎస్ఎఫ్ దళాన్ని నారాయణపేటలో మోహరించారు' అని పోలీస్ అధికారి పాండా తెలియజేశారు.
వారు వెళ్ళిపోవడం లేదు. ఇంకా లేదు.
Pages: -1- 2 News Posted: 22 June, 2009
|