ఐడి కార్డ్ ప్రాజెక్టులో నీలేకని
'ఆయన కేంద్ర మంత్రిగా శాఖలను లేదా మంత్రిత్వశాఖల వ్యవహారాలు చూడాలని అనుకోవడం లేదు. కాని ఇంత భారీ పరిమాణంలోని, ప్రాధాన్యం గల జాతీయ ప్రాజెక్టును నిర్దుష్ట వ్యవధిలో అమలు పరచడానికి ఆయన సుముఖంగా ఉన్నారు' అని పేరు వెల్లడికి ఇష్టపడని నీలేకని మిత్రుడు ఒకరు చెప్పారు. స్వతంత్రంగా వ్యవహరించడానికి, సాధికారికంగా ప్రాజెక్టును అమలు పరచడానికి నీలేకనికి అవకాశం లభించడానికి క్యాబినెట్ మంత్రి హోదా ఉండడం అవసరం. ఎందుకంటే ప్రణాళికా సంఘంతో పాటు హోమ్, కార్మిక, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖల నుంచి సమన్వయంతో దీనిని అమలు పరచవలసి ఉంది.
ప్రణాళికా సంఘం అజమాయిషీలో భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐఎఐ)ని ఏర్పాటు చేస్తున్నట్లు మొదటి యుపిఎ ప్రభుత్వం జనవరి 18న ప్రకటించి ఈ ప్రాజెక్టు అమలుకు నాందీ వాచకంగా మధ్యంతర బడ్జెట్ లో రూ. 100 కోట్లు కేటాయించింది. క్యాబినెట్ మంత్రి హోదాతో నీలేకని బాధ్యతలు చేపట్టడానికి వీలుగా ఈ సంస్థ పాలనా వ్యవస్థను సవరించవచ్చు.
యుఐడి ప్రాజెక్టును అమలులోకి తీసుకువచ్చిన తరువాత రకరకాల గుర్తింపు విధానాల అవసరం తొలగిపోతుంది. శాశ్వత ఐడి కార్డులో ఒక ప్రత్యేక నంబర్, ఫోటో, బయోమెట్రిక్ డేటా ఉంటాయి. ఆరంభంలో ప్రస్తుత ఓటర్ల జాబితా డేటా ఆధారంగా వోటర్లందరికీ, ఆ జాబితాలో చేర్చే 18 ఏళ్ళ లోపువారందరికీ ఈ కార్డు ఇస్తారు.
Pages: -1- 2 News Posted: 22 June, 2009
|