గగనం నుంచి టెర్రర్ దాడి?
గత నవంబర్ 26 ముంబై దాడులలో ప్రమేయానికి గాను షా ప్రస్తుతం పాకిస్తానీ అధికారుల నిర్బంధంలో ఉన్నాడు. ముంబై క్రైమ్ బ్రాంచ్ చార్జిషీటు ప్రకారం, ముంబైలో దాడులు జరిపిన పది మంది సాయుధ ఉగ్రవాదుల బృందంతో సమాచార సంబంధాల కోసం లష్కర్ ఉపయోగించిన 'వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసుల'కు అతనే ఏర్పాట్లు చేశాడు. ఇండియాలో విమానాశ్రయాలు, వివిఐపిలు లక్ష్యాలుగా దాడులు సాగించేందుకు బాడుగకు తీసుకున్న లేదా అపహరించిన చార్టర్ ఫ్లైట్ ను వినియోగించవచ్చునని ఐబి సేకరించిన ఆ సమాచారం సూచించింది.
నిర్దుష్టమైన ఆ అలర్ట్ వల్ల హోమ్ మంత్రిత్వశాఖ 'అనుమానిత వ్యాపార అభ్యర్థనలు, విమాన ప్రయాణ ప్లాన్లతో వచ్చే వ్యక్తులను గమనించవలసిందిగా' దేశంలోని ఎయిర్ చార్టర్ సర్వీసుల ఆపరేటర్లు సుమారు 100 మందిని అప్రమత్తం చేసింది. 'అనుమానిత ప్రయాణికుల గురించి మాకు వివరించారు. అటువంటి వ్యక్తులు తారసపడిన వెంటనే అధికారులకు తెలియజేయవలసిందిగా మమ్మల్ని కోరారు' అని ఢిల్లీకి చెందిన ఒక చార్టర్ సర్వీస్ సంస్థ అధికారి ఒకరు 'హిందుస్థాన్ టైమ్స్' పత్రిక విలేఖరితో చెప్పారు. ఆయన పేరు వెల్లడి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
'భారతదేశపు ఏకైక విమానవాహక నౌక ఐఎన్ఎస్ విరాట్, వైజాగ్ నేవల్ డాక్ యార్డ్, కొచ్చిన్ షిప్ యార్డ్ లతో సహా నౌకాదళ లక్ష్యాలపై తన సుశిక్షితులైన కార్యకర్తలతో ఆత్మాహుతి దాడులు' జరిపించాలని లష్కర్ వ్యూహం పన్నిందని కూడా తమకు సమాచారం అందిందని ఐబి వర్గాలు తెలియజేశాయి. 'అటువంటి దాడిని నిరర్థకం చేయడానికి సంబంధిత అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు' అని ఆ వర్గాలు తెలిపాయి.
Pages: -1- 2 News Posted: 23 June, 2009
|