చిరంజీవి రాజీనామా?
పార్టీలో ఒక్కరే బాధ్యతలను నిర్వహించకుండా ఉండేందుకు దేవేందర్ గౌడ్ ను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా రానున్న ఎన్నికల నాటికి అభిమానులపైనే ఆశలు పెట్టుకుంటూ, అభిమానులను దూరం చేయకూడదనే ఉద్దేశంతోనే చిరంజీవి నాయకులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ అధినేతగా ఉన్నా, లేకున్నా పార్టీకి భవిష్యత్ నిర్మాణం అనేదాన్ని మాత్రమే చిరంజీవి గుర్తిస్తూ ఆదిశగానే ముందుకు సాగుతున్నారు. మిత్రా బాటలో వినయ్, కె.ఎస్ మూర్తి కూడా రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నా చిరంజీవి ఆ దిశగా ఏమాత్రం స్పందించలేదు. ఉండేవారు ఉంటారు, పోయేవారు పోతారు కానీ పార్టీ భవిష్యత్ మాత్రమే తనకు ముఖ్యం అన్నరీతిలోనే చిరు ముందుకు వెళుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సైతం చిరంజీవి నాయకులకు ఈ విధంగానే తేల్చి చెప్పారు. రానున్న రోజుల్లో కిందిస్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేపట్టాలని చిరు సూచించారు. అలాగే రానున్న రోజుల్లో భవిష్యత్ అభ్యర్థులదేనని చిరంజీవి తేల్చిచెప్పినట్లు సమాచారం. అభిమానులు, కార్యకర్తలే పార్టీ వెంట ఉంటారనీ వారిని ప్రజారాజ్యంలో దగ్గరచేసుకుంటూ ముందుకు కదలాలనీ పార్టీ శ్రేణులకు చిరంజీవి సూచనలు చేస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 23 June, 2009
|