`ఎల్ నినో' కబళిస్తోంది
ఎల్ నినో ప్రభావం దేశ రుతుపవనాలపై కనిపిస్తోందని, దీనిని ఇంకా పరిశీలించాల్సి ఉందని భారత వాతావరణ విభాగం ప్రతినిధి బిపి యాదవ్ చెప్పారు. జూలై, ఆగస్టు నెలలో ఏర్పడే పరిణామాలపై జూన్ 25న అంచనావేస్తామని వివరించారు.2002, 2004 సంవత్సరాల్లో ఎల్ నినో ఏర్పడినప్పుడు భారతదేశంలో వర్షాలు చాలా తక్కువ కురిశాయి. రుతుపవనాలపై రెండింట మూడో వంతు మాత్రమే ప్రభావం చూపిండం గమనించాల్సింది. కాగా ఎల్ నినో హెచ్చరికతో ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను మదింపు చేయడానికి ప్రభుత్వ కార్యదర్శులతో కమిటీని కూడా ఏర్పటు చేసింది. రుతుపవనాలు విఫలం అయితే తీసుకోవల్సిన చర్యలను గురించి ప్రణాళికలు రూపోందిచవలసిందిగా ముఖ్యమైన రాష్ట్రాలను ఈ కమిటీ ఆదేశించింది.
రుతుపవనాలు శక్తిమంతంగా రూపొందకపోతే ప్రభుత్వం అనేక రంగాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వర్షాధార భూములలో వ్యవసాయం దెబ్బతినడం ఖాయం. అలానే మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అనావృష్టి వల్ల రిజర్వాయర్ల లో నీటి మట్టాలు పడిపోతే జల విద్యుత్ ఉత్పాదన పడిపోతుంది. ఇప్పటికే రిజర్వాయర్లలో గత పదేళ్ళకంటే తక్కువ స్థాయికి పడిపోయాయి. దుర్భిక్షం తాండవిస్తే యూపియే ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్లో చాలా వాటిని నెరవేర్చడం కష్టతరం కావచ్చు. ముఖ్యంగా ఆహర భద్రత చట్టం హామీ తలనెప్పులను కలిగించవచ్చు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోతే గోదాములు ఖాళీ అయితే దుర్భిక్షం ఏర్పడటం, అలానే ఆహార ధాన్యాలు ధరలు పెరిగి పోవడం వంటి సమస్యలను కేంద్రం ఏదుర్కోటానికి సిద్ధం అవుతుంది.
Pages: -1- 2 News Posted: 23 June, 2009
|