`టీ' పై పెదవి విప్పొద్దు
ఇద్దురు, ముగ్గురు తెలంగాణ నేతలు చేస్తున్న ఒత్తిడికి తలొగ్గి, బాబు నిర్ణయాలు తీసుకుంటున్నారని, దానివల్ల పార్టీ మొత్తం మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని, పార్టీకి నష్టం వాటిల్లకూడదన్న కారణంతో తాము కూడా వాటిని ఆమోదించవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని ఆంధ్ర-సీమ నేతలు చాలాకాలం నుంచి విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబు నాయకులను కట్టడి చేయడం ప్రాధాన్యం ఏర్పడింది.
ఆంధ్ర-రాయలసీమ ప్రాంత వాసులకు సానుకూల సంకేతాలు పంపేందుకే బాబు ఈ విధంగా హెచ్చరించినట్లు కనిపిస్తోంది. దీనివల్ల టిఆర్ఎస్ తో కలసి వెళ్ళినందుకు టిడిపిపై అసంతృప్తితో లోక్ సత్తాను ఆదరించిన సెటిలర్లనూ తృప్తి పరచినట్లు ఉంటుందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీనే స్పష్టంగా చెప్పినందున ఇక ప్రతిపక్షంలో ఉన్న తాము దాని గురించి మాట్లాడం వల్ల రాజకీయంగా వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదంటున్నారు.
తెలంగాణపై పార్టీ నాయకులను ఇప్పుడు కట్టడి చేయడమే సరైన నిర్ణయమని, భవిష్యత్తులో దానిపై మరొకరు మాట్లాడకుండా ఉంటారని చెబుతున్నారు. `మా పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు. తెలంగాణ ఇచ్చే పరిస్థితిలో అంతకన్నా లేదు. కాబట్టి ప్రజాసమస్యల కోసం పోరాడే పార్టీగా కొనసాగడమే ఉత్తమం. కాకపోతే దెబ్బతిన్న సెటిలర్ల వరకూ ఓట్లేయలేదు. పార్టీకి సంబంధించినంత వరకూ ఇది మంచి పరిణామమే. ముందు పార్టీ ముఖ్యం. అసలు తలసాని శ్రీనియాసయాదవ్ ఈ చర్చ మొదలుపెట్టకపోతే సెటిలర్లు శాశ్వతంగా మాకు దూరమయ్యేవారు. ఇప్పుడు బాబుగారు తెలంగాణ గురించి ఎవరూ మాట్లాడవద్దని చెప్పి సెటిలర్లలో ఉన్న ఆందోళన పూర్తిగా తొలగించార'ని నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 News Posted: 27 June, 2009
|