`స్థానికం'లో సుస్థిరం
అంతేకాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం పోటీ కూడా బాగా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు తనకే వస్తుందని ధీమా ఉండటం వల్ల నియోజకవర్గ ఇంచార్జిగా నియమితులైన వారు ఇప్పటి నుంచే గట్టిగా పని చేసేందుకు అవకాశం ఉంటుందని, అలాగే అదే నియోజకవర్గంలో టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులకు ముందుగానే ఫలానా అభ్యర్థికి టిక్కెట్టు లభిస్తుందని తెలియడం వల్ల అభ్యర్థుల ఎంపిక సందర్భంగా పోటీ పడే అవకాశాలుండవని అనుకుంటున్నారు. తనకు టిక్కెట్టు రాదన్న విషయం తెలిసిన తర్వాత పార్టీలో కొనసాగాలా వద్దా అన్నది ఇప్పుడే నిర్ణయించుకుంటారని, దీనివల్ల ఎన్నికల ముందు టిక్కెట్లు ఖరారైన తర్వాత పార్టీ మారే అవకాశం కూడా ఉండదని భావిస్తున్నారు. ఇంచార్జిగా నియమితులైన నాయకులు తమ నియోజకవర్గంలోని పార్టీ యంత్రాంగాన్ని తన వెంట తీసుకువెళ్ళాల్సి ఉంటుందని ఎటువంటి గ్రూపులు, వర్గాలు లేకుండా అందరినీ ఒకతాటిపై నడిపించాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. ఆ విధంగా నిర్వహిండంలో విఫలమైన పక్షంలో కొత్త వారికి అవకాశం ఇస్తామని వారంటున్నారు.
వాస్తవానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కూడా అత్యంత కీలకమైనవి. అధికారంలో ఉన్నాం కదా అని ఉదాసీన వైఖరి అవలంభిస్తే ప్రతిపక్ష పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకునే ప్రమాదం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు మెజారిటీ స్థానాలు గెలిపొందినట్లయితే ప్రభుత్వ కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డుతగిలే అవకాశం ఉంటుందని, దీనివల్ల ప్రభుత్వం ఆశించిన విధంగా కార్యక్రమాలను చేపట్టేందుకు వీలుండదని వారంటున్నారు. స్థానిక సంస్థలు మెజారిటీ సంఖ్యలో అధికార పార్టీ చేతుల్లో ఉన్నట్లయితే పాలనతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు కూడా సజావుగా సాగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 29 June, 2009
|