అర్థం కాని కేసీఆర్
అసమ్మతి నేతలను చాలా కాలం బయట ఉంచితే మరిన్ని విమర్శలకు తావిచ్చినట్టవుతుందన్న ఆలోచనతోనే కెసిఆర్ రాజీ వ్యాహాన్ని, రాయబార తంత్రాన్నీ అనుసరించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రత్యేకించి అందరికన్న ఎక్కువగా నోటి దురుసు తనాన్ని ప్రదర్శించిన రవీంద్ర నాయక్, చంద్రశేఖర్ ను అతి కష్టం మీద ఒప్పించి పార్టీలోకి రప్పించుకున్నది అందుకేనని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తెలంగాణ భవన్ ఘటన తర్వాత రవీంద్రనాయక్ మరీ రెచ్చిపోయి మాట్లాడారు. ఇక తనను హత్య చేయించేందుకు కుట్ర జరుగుతున్నదని కెసిఆర్ సంచలన ప్రకటన చేసిన కొద్ది సేపటికే ఆయనను చంపినా, పిచ్చి కుక్కను చంపినా ఒకటే అని చంద్రశేఖర్ సంచనల వ్యాఖ్య చేశారు.
ఇలాంటి ప్రకటనలు మరెన్ని వస్తాయో అనే అనుమానంతోనే కెసిఆర్ ఒక అడుగు వెనక్కి వేసి అసమ్మతి నేతలను అయిష్టంగా అయినా ఆహ్వానించాల్సి వచ్చిందని సీనియర్ నేత ఒకరు అన్నారు. పార్టీలో ఉంటే ఏమీ మాట్లాడలేరు కనుక, ఆ విధంగా వారి నోటికి తాళం వేసినట్టు అవుతుందని, అది చూసి మిగిలిన వారు సైతం ఏమీ మాట్లాడలేని స్థితి ఏర్పడుతుందన్న ఆలోచనతోనే కెసిఆర్ ఈ వ్యాహానికి తెర తీసినట్టు మరో నాయకుడు వ్యాఖ్యానించారు. అసమ్మతి నేతలతో చేతులు కలిపి కెసిఆర్ ను దుమ్మెత్తి పోసి, పాలమూరులో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరిన మరో నేత ఎంఎ రమ్మాన్ మళ్ళీ టిఆర్ఎస్ లో కలసినట్టే కలిసి పక్కకెళ్ళిపోయారు. శనివారం కెసిఆర్ నివాసానికి అందరితో కలిసి వెళ్ళి విందు ఆరగించిన ఆయన, చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయారు. ఆయన తెరాసకు శాశ్వతంగా రాంరాం చెప్పినట్టేనని అంటున్నారు.
Pages: -1- 2 News Posted: 30 June, 2009
|