ఓట్ల లోటుపై వైఎస్ మండిపాటు
ఉదారహణకు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ కె నాగేశ్వరరావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తణుకు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాగా నాగేశ్వరరావు లోగడ ద్వారకాతిరుమల నుంచి జెడ్ పిటిసీగా ఎన్నికైనా, ఈ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి అక్కడ నెగెటివ్ ఓటింగ్ లభించింది. కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. జిల్లా పరిషత్ చైర్మన్ లోగడ జెడ్ పిటీసీగా గెలుపొందిన మొవ్వలోనే పార్టీకి చుక్కెదురైంది. నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న వెంకట్రమణారెడ్డి ప్రాతినిధ్య వహిస్తున్న తాడ్వాయి మండలంలో పార్టీకి 10వేల ఓట్లు తక్కువ వచ్చాయి. పిసిసి అధ్యక్షడు డి శ్రీనివాస్ తనయుడు సంజయ్ మేయర్ గా ఉన్నప్పటికీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ లో 268 ఓట్లు తక్కువ వచ్చాయి. వరంగల్ కార్పొరేషన్ మేయర్ గా ఉన్న ఎర్రబెల్లి స్వర్ణ లోగడ ఎన్నికైన 39వ వార్డులో ఈసారి 900 ఓట్లు తక్కువ వచ్చాయి. విశాఖపట్నం మేయర్పులుసు జనార్దన్ రావు గెలుపొందిన 56వ వార్డులో ఈ దఫా పార్టీకి 4 వేలఓట్లు తగ్గి, 3వ స్థానంలో నిలిచింది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ దామోదర్ రెడ్డికి చెందిన సొంత మండలం తాడూరులో పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. చివరకు మున్సిపల్ చైర్మన్ల చాంబర్ అధ్యక్షునిగా ఉన్న నల్లగొండ మున్సిపల్ చైర్మన్ నారాయణ గౌడ్ వార్డులో కూడా 146 ఓట్లు తగ్గాయి.
ఇలా ఉండగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చైర్మన్లుగా నియమించాలనుకుంటున్న వారి జాబితాపై కూడా చర్చించినట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాతనే కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు జరపాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయించారు. అయితే ఉన్న పదవులు తక్కువ, వాటిని ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా జాబితాను కుదించే కసరత్తు చేపట్టినట్లు తెలిసింది. అలాగే కాంగ్రెస్ శాసనసభా పక్షానికి (సిఎల్ పి) కార్యవర్గం నియమాకంపై కూడా చర్చించినట్లు తెలిసింది.
Pages: -1- 2 News Posted: 2 July, 2009
|