100 డే 'హానీమూన్' వద్దు!
ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థలలో ఈ 100 రోజుల టార్గెట్ అనేది ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అధ్యక్ష కాలం నుంచి మొదలైంది. 1933లో రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి అమెరికన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయి ఉంది. ఆర్థిక వ్యవస్థకు మళ్ళీ ప్రాణం పోసి నిలబెట్టేందుకు రూజ్వెల్ట్ 100 రోజుల ప్రణాళికను ప్రకటించారు. మొదటి 100 రోజుల కాలంలో 'న్యూ డీల్'గా అభివర్ణిస్తూ పదిహేను శాసనాలు చేశారు. గ్రేట్ డిప్రెషన్ నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేయడంలో న్యూ డీల్ కీలకమైన పాత్ర పోషించింది. అప్పటి నుంచి కొత్త అధ్యక్షుడి పనితీరును తొలి 100 రోజులలో మదించే విధానం ఆరంభమైంది.
భారతదేశంలో కూడా 1996లో హెచ్ డి దేవె గౌడ ప్రధానమంత్రిగా ఏర్పాటైన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 100 రోజుల ఎజెండాను ప్రకటించింది. అయితే అజెండాలో పేర్కొన్న అనేక సంస్కరణలు అమలుకు నోచుకోలేదు. గౌడ నుంచి ప్రధానమంత్రి పగ్గాలు పుచ్చుకున్న ఐకె గుజ్రాల్ సైతం అదే విధానాన్ని కొనసాగించారు. ఇక వాజ్ పేయి ప్రధానమంత్రిగా 1998లోను, 1999లోను ఏర్పడ్డ ఎన్డీయే ప్రభుత్వం కూడా 100 రోజుల ప్రణాళికలను ఆవిష్కరించినప్పటికీ వాటిలో కూడా అనేకం క్రియాశీలం కాలేదు.
Pages: -1- 2 News Posted: 2 July, 2009
|