రహదారులకు మహర్దశ
ప్రస్తుతం దేశంలో 70వేల 500 కిలోమీటర్లు పొడవైన జాతీయ రహదారులు, లక్షా 30 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు ఉన్నాయని చెప్పారు. ఈ రహదారులపై టోల్ ఆదాయం బాగానే ఉందని, కాని అన్ని రహదారుపై టోల్ రుసుం వసూలు చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. రహదారులు వెళుతున్న అన్ని ప్రాంతాల్లో వాణిజ్యపరమైన అభివృద్ధి ఒకేలా ఉండదని ఆయన వివరించారు. అందుకే రహదారుల ఆర్ధిక సంస్థను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్టు కమల్ నాథ్ తెలిపారు. ఈ సంస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిధులను సేకరిస్తుందని ఆయన చెప్పారు.
రహదారుల నిర్మాణానికి భూ సేకరణ ప్రధాన అడ్డంకిగా మారుతోందని ఆయన చెప్పారు. దేశంలో రహదారుల నిర్మాణానికి జరుగుతున్న భూ సేకరణలో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటుందని తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికి రాష్ట్రాలకు ఇస్తున్న ఏడు వేల కోట్ల రూపాయల మంజూరును నిలిపివేయాలని నిర్ణయించామని వివరించారు. భూ సేకరణను వేగవంతంగా చేస్తామని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రహదారుల భూ సేకరణ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తూ రాష్ట్రాలు ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఆ తరువాతే ఆ నిధులు ఇస్తామని చెప్పారు.
Pages: -1- 2 News Posted: 4 July, 2009
|