మావోలపై ఉక్కుపాదం
ఈ ఐదేళ్ళ కాలంలో నక్సలైట్లకు, పోలీసులకు మధ్య జరిగిన పోరాటంలో ఆంధ్రాలో మావోయిస్టు పార్టీ ఇంచుమించుగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ పరిణామాల తర్వాత మావోయిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తాము జరిపిన చర్చలు చారిత్రక తప్పిదమని లెంపలేసుకుంది. ఈ విషయాన్ని 2007లోనే మావోయిస్టు పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం మావోయిస్టుల కదలికలు లేకపోయినా, పశ్చిమబెంగాల్, చత్తీస్ గడ్ తదితర రాష్ట్రాల్లో ఆంధ్రాకు చెందిన మావోయిస్టు అగ్రనేతలే ఉద్యమాలను నిర్వహిస్తున్నారు. పశ్చిమబెంగాల్ లో లాల్ గఢ్ లో మావోయిస్టుల అణచివేత కార్యక్రమం గత పక్షం రోజులుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో మావోయిస్టుకు గుండెకాయ లాంటి దండకారణ్యం ప్రాంతాన్ని చుట్టిముట్టి అక్కడ ఉన్న పది వేల మంది మావోయిస్టు పార్టీ గెరిల్లాలు, పార్టీ కేంద్ర కమిటీ నేతలను పట్టుకోవడానికి కేంద్రం ప్రణాళిక ఖరారు చేసింది.
దీని కొనసాగింపుగానే ఆగస్టు నెలలో ముఖ్యమంత్రుల సదస్సును నిర్వహిస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల నుంచి భారీ ఎత్తున మావోయిస్టులను తుదముట్టించే పోలీసు ఆపరేషన్లకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇందులో ఆంధ్రాకు చెందిన గ్రేహౌండ్స్ దళాలు వ్యూహాత్మకంగా మద్దతు ఇచ్చే అవకాశాలను రాష్ట్రం పరిశీలిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరి చెప్పారు. ఇప్పటికే దేశంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు మావోయిస్టు పార్టీని నిషేధించాయి. కాగా గత నెల 22న కేంద్రం మావోయిస్టు పార్టీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధించింది.
Pages: -1- 2 News Posted: 9 July, 2009
|