తగ్గని ఇంజనీరింగ్ క్రేజ్
గత సంవత్సర ఇంజనీరింగ్ విద్యార్థులు సిఎస్ ఇ, ఐటి కోర్సులకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. మారిన పరిస్థితుల్లో ఐటి రంగం సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సారి అత్యధికంగా విద్యార్థులు ఇసిఇ కోర్సుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండు మూడేళ్ళ క్రితం వరకు మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఐటి, సిఎస్ ఇ కోర్సులపై ఈసారి మెరిట్ విద్యార్థులు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. గత సంవత్సరం ఇవే కోర్సులకు జెఎన్ టియు, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో రెండు వందల లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు లభించాయి. కానీ ఈ సారి పరిస్థితి చూస్తుంటే నాలుగైదు వేల ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు సైతం ఈ కోర్సుల్లో యూనివర్సిటీల్లో సీటు లభించినా ఆశ్చర్యం పోవలసిన అవసరం లేదంటున్నారు. మార్కెట్ ఒడిదుడుకులకు సంబంధం లేకుండా ఇసిఇ, ఇఇఇ కోర్సులకు ఉద్యోగావకాశాలు ఉంటాయనే భావనతో ఎక్కు మంది విద్యార్థులు ఈ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు.
జెఎన్ టియు, ఉస్మానియా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీలపై విద్యార్థులు చాలా ఆసక్తి చూపుతున్నారు. వీటి తర్వాత అక్రిడిడేటేడ్ కాలేజీలపై ఆసక్తి చూపుతున్నారు. కన్వీనర్ కోటా కింద సీటు పొందిన వారి నుంచి కాలేజీ యాజమాన్యాలు నిర్దేశిత ఫీజునే వసూలు చేస్తున్నప్పటికీ ప్రైవేటు కాలేజీల్లో వివిధ పేర్లతో పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఘట్ కేసర్ వద్ద గల ఒక కాలేజీ విద్యార్థులకు ఏసి గదుల్లో పాఠాలు చెబుతోంది. అదే విధంగా విద్యార్థులకు ఏసి బస్సులు ఏర్పాటు చేశారు. వీటికి తగ్గట్టుగానే ఫీజులు వసూలు చేస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 11 July, 2009
|