నక్సలిజం పెను సవాలే
అయితే ఇటీవల కాలంలో నక్సలైట్లు కొత్త వ్యూహాలతో ఎంపిక చేసుకున్న లక్ష్యాలపై దాడులకు పాల్పడుతుండడం కేంద్రానికి ఆందోళన కలిగిస్తున్నది. గతంలో వలె కాకుండా మావోయిస్టులు కొత్త వ్యూహరచనతో అడవుల నుంచి బయటకు వచ్చి కూడా దాడులకు పాల్పడుతుండడం ప్రభుత్వంలో కలవరానికి కారణమైంది. ముఖ్యంగా నక్సలైట్లు పోలీసులను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు పక్కా వ్యూహంతో విరుచుకుపడి ఒక ఎస్పీ సహా 36 మంది పోలీసులను బలితీసుకున్న సంఘటన ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నది.
ఇటీవలి లోక్ సభ ఎన్నికల మొదటి విడతలో కూడా నక్సల్స్ పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడ్డారు. అంతే కాకుండా పశ్చిమ బెంగాల్ లోని లాల్ గఢ్ ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో నక్సల్స్ ఏరివేతకు కేంద్రం ప్రత్యేక బలగాలను పంపాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో గత నెలలో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని నిషేధించింది. మావోయిస్టులతో నేరుగా చర్చలకు అవకాశం లేదని స్పష్టం చేసింది. జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బీహార్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాలలో మావోయిస్టులు బలంగా ఉన్నారు.
Pages: -1- 2 News Posted: 16 July, 2009
|