ఆసక్తి చూపని నేతలు
హోంశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డి, డిజిపి ఎస్ ఎస్ పి యాదవ్ కమిటీ చైర్మన్ రిటైర్డ్ జడ్జి కెటి థామస్ ను కలిసి సంస్కరణల అమలు తీరును వివరించారు. కొత్త పోలీసు చట్టాన్ని త్వరలో తేనున్నట్లు వారు కమిటీకి వివరించారు. అలాగే పోలీసు సంస్కరణలపై సుప్రీం సూచించిన ఆరు మార్గదర్శకాల్లో మూడింటిని ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన మూడు మార్గదర్శకాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, దీనిపై కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయని కమిటీకి నివేదించినట్లు సమాచారం. లోక్ సత్తా తరపున కో ఆర్డినేటర్ టిఎల్ నరసింహారావు, టి బాలగంగాధర్, ఎస్ శశిభూషణ్ తదితరులు కమిటీని కలిసి వినతిపత్రం సమర్పించారు.
కామన్ వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ లో పోలీసు సంస్కరణల అమలు తీరుపై అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటును వ్యతిరేకించిందని సిహెచ్ ఆర్ ఐ పేర్కొంది. అలాగే డిజిపిని రెండేళ్ళపాటు కొనసాగించడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో ప్రభుత్వం పేర్కొందన్నారు. పోలీసు కంప్లైంట్స్ అథారిటీస్ ను ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించిందని సిహెచ్ ఆర్ ఐ పేర్కొంది. లోక్ సత్తా కో ఆర్డినేటర్ టిఎల్ నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, రెండేళ్ళపాట తప్పనిసరిగా డిజిపి పదవిలో నియమితులైన వ్యక్తి కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Pages: -1- 2 News Posted: 18 July, 2009
|