కసబ్ ఎత్తు వేశాడా?
అరెస్టయిన తర్వాత కసబ్ మార్చి చివరిలో ఒక వీడియో కాన్ఫరెన్స్ లో కనిపించాడు. ఏప్రిల్ మొదటివారంలో కసబ్ తరఫున లాయర్ గా అంజలిని తొలగించారు. అనంతరం ఆ స్థానంలో అబ్బాస్ అజ్మీని నియమించారు. 166 మంది అమాయకుల ప్రాణాలను హరించిన ఉగ్రవాద దాడిపై విచారణ ఏప్రిల్ 20న ఆరంభమైంది. మే ఎనిమిదిన కోర్టుకు హాజరైన ప్రత్యక్ష సాక్షి ఒకరు కసబ్ ను గుర్తించారు. అప్పటి నుంచి వివిధ దశల్లో కసబ్ పై విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 134 మందిని విచారించి సాక్ష్యాలను కోర్టు నమోదు చేసింది. వారిలో ప్రతి ఒక్కరూ కసబ్ కు వ్యతిరేకంగానే సాక్ష్యం చెప్పారు. కసబ్ మాత్రం తన నేరం అంగీకరించలేదు. విచారణ సమయంలోనూ అతను ఎలాంటి ఒత్తిడికిలోను కాకుండా నవ్వులు చిందిస్తూ కూర్చోవడం కనిపించింది. ఇన్నాళ్ళు తాను నిర్దోషినని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ వచ్చిన కసబ్ హఠాత్తుగా సోమవారం కోర్టులో తన నేరాన్ని అంగీకరించడం సంచలనం సృష్టించింది. ఇదిప్రాసిక్యూషన్ ఘన విజయమని వ్యాఖ్యానించారు. కసబ్ ప్రకటన తమను ఆశ్చర్యంలో ముంచెత్తిందని, కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరూ దిగ్ర్భాంతి చెందారని అన్నారు. మరో క్రిమినల్ లాయర్ సతీష్ మనిషిండే మాట్లాడుతూ కసబ్ ప్రకటన వ్యూహాత్మక ఎత్తుగడ కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అతని వాంగ్మూలాన్ని నిశితంగా పరిశీలిస్తామని అన్నారు.
Pages: -1- 2 News Posted: 21 July, 2009
|