ఇవిఎంపై కాంగ్రెస్ ప్రేమ
ఫలితాలు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా లేవన్న అనుమానం తలెత్తితే దేశంలో అంతర్గత కలహాలు, అశాంతికి అవకాశాలేర్పడతాయి. ప్రస్తుతం ఇరాన్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. అక్కడి ప్రభుత్వం మరోసారి ఎన్నికైనప్పటికీ ప్రజలు ఎన్నికల ఫలితాలను, నిర్వహణాతీరును విశ్వసించడం లేదు. ఫలితాలు తమ ఓటింగ్ విధానానికి అనుగుణంగా రాలేదన్న సందేహం వారిని పీడిస్తోంది. దీంతో ప్రభుత్వంపై అంతర్గత తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్ తన విధానాలను మార్చుకోని పక్షంలో దేశ ప్రజల్లో ఆ పార్టీ పట్ల అనుమానాలు మరింత పెరిగే ప్రమాదముంది. సాంకేతికంగా కాంగ్రెస్ విజయం సాధించి అధికారం చేపట్టినప్పటికీ ప్రజలు మాత్రం దాన్ని అంగీకరించే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సంశయాత్మకంగానే చూస్తారు. ప్రభుత్వ పథకాలన్నింటిలో తప్పులు వెదుకుతున్నారు. చేసే ప్రతిపనిని భూతద్దంతో పరిశీలిస్తున్నారు.
జనచైతన్య వేదిక వంటి పేరెన్నికగన్న ఒక స్వచ్ఛంద సంస్థ బహిరంగంగా నిరూపించిన అంశంపై కాంగ్రెస్ కంటే ఎన్నికల కమిషన్ కు స్పందించాల్సిన బాధ్యత ఉంది. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. తామసలు చేస్తున్న విధానాలు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను దీర్ఘకాలం పాటు కొనసాగేందుకు ఉపకరిస్తాయన్న భరోసా ప్రజలకు కల్పించాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ ఈ చర్యలకు ఉపక్రమించడం సర్వసాధారణం. విమర్శలకు బదులివ్వాలని భావించడం కమిషన్ బాధ్యత. అయితే వారికంటే ముందుగానే కాంగ్రెస్ ఈ వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శించడం ప్రజల అనుమానాలు నిజమేనన్న ఆందోళనకు తావిస్తున్నాయి.
Pages: -1- 2 News Posted: 21 July, 2009
|