కాంగ్రెస్ గూటికి రెహమాన్?
ఈ సందర్భంగా విలేఖరులు కెప్టెన్ తో మాట్లాడాలని ప్రయత్నించగా నీ ఇష్టం ఉన్నది రాసుకోండంటూ కొంత అసహనాన్ని ప్రదర్శించినట్టు తెలుస్తోంది. మరోవైపు అసమ్మతి నేత హెచ్.ఎ.రెహమాన్ దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కన్వీనర్ ఎం.సుందర్శన్ రావు, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలత యాదవ్ లతో పాటు పలువురు మైనారిటీ నాయకులు రెహమాన్ ను ఆయన నివాసంలో కలుసుకుని మంతనాలు జరిపారు. వీరంతా దాదాపుగా రెహ్మాన్ తో కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో అసమ్మతి నేత ఎ.చంద్రశేఖర్ మాత్రం తాము తెదేపా, కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రశ్నే లేదని, తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారానే పోరాడతామంటూ ప్రకటించారు. మాజీమంత్రి రవీంద్రనాయక్ సోమవారం మళ్ళీ కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. పలు అంశాలపై ఆయన పార్టీ అధినేతను నిలదీశారు.
పార్టీలో కొన్ని పరిణామాలు జరుగుతున్నా కేసీఆర్ వైఖరిలో మార్పులేదని తాము వేసిన 15 ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పలేదని, ఇప్పటికైనా కేసీఆర్ తన తప్పులను ఒప్పుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని రవీంద్ర నాయక్ ఆ లేఖలో కేసీఆర్ ను డిమాండ్ చేశారు. పార్టీలో ఇన్ని పరిణామాలు సంభవిస్తున్నా కేసీఆర్ మాత్రం నోరు విప్పడం లేదు. ఆషాడం పూర్తయ్యేవరకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టవద్దంటూ సిద్దాంతులు ఇచ్చిన సలహా మేరకే కేసీఆర్ విమర్శలను సైతం ఎదుర్కొంటూ మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఈ విధంగానే మౌన ముద్రలో ఉంటే మరింత మంది కేసీఆర్ వైఖరిని తప్పుబడుతూ పత్రికలకు ఎక్కే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Pages: -1- 2 News Posted: 22 July, 2009
|