నక్సల్స్ పై మెరుపుదాడి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నక్సలైట్ల ఆపరేషన్ నిమిత్తం గ్రేహౌండ్స్ బలగాలను 1988లో ఏర్పాటు చేసింది. ఈ బలగాలను నక్సలైట్ల ఏరివేత పనులకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. మిగతా శాంతి భద్రతలకు ఎటువంటి పరిస్థితుల్లో ఇంతవరకు వినియోగించలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రిజర్వు బెటాలియన్లు, కోబ్రా పేరిట పోలీసు బలగాలను ఏర్పాటు చేసింది. కాని నక్సలైట్ల ఏరివేతకు ప్రత్యేకంగా పోలీసు బలగాల సంస్థను ఏర్పాటు చేయలేదు. సిఆర్ పి ఎఫ్ లో పనిచేస్తున్న బలగాలను శాంతి భద్రతల నిమిత్తం అనేక ప్రాంతాల్లో బహుళ టార్గెట్లకు వినియోగిస్తున్నారు. సెక్యూర్, హోల్డ్, అడ్మినిష్టర్ అనే లక్ష్యంతో ఏర్పాటు చేయనున్న టాస్క్ ఫోర్స్ నక్సల్స్ ప్రాంతాలను ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత స్థానిక రాష్ట్ర పోలీసులకు అప్పచెప్పనుంది. ఈ విధానంపై ఒక పత్రాన్ని రూపొందించారు. దీనిని ముఖ్యమంత్రుల సదస్సులో ఉంచనున్నారు. ఎన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నక్సలైట్ల చేతిలో భారీ ఎత్తున పోలీసు బలగాలు హతం కావడం కేంద్రాన్ని, పోలీసు బలగాల సంస్థలకు మానసికంగా కలవరపాటుకు గురిచేస్తోంది.
గత వారంలో చత్తీస్ గఢ్ లో ఒక ఎస్పీతో సహా 37 మందిని నక్సలైట్లు బలిగొన్నారు. గత నెల 21వ తేదీన కూడా పోలీసుల తప్పిదాల వల్ల దండకారణ్యంలో జరిగిన సంఘటనలో 11 మంది పోలీసులు మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటివరకు 180 మంది పోలీసులు నక్సలైట్ల చేతిలో హతమయ్యారు. కాగా జిహాదీ మాదిరిగానే మావోయిస్టులు ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని హతమారుస్తామని ప్రకటన చేస్తున్నారంటే మీడియాలో ప్రచారం కోసం ఎత్తుగడ అయి ఉండవచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నారు. ఇంతవరకు కానిస్టేబుళ్ళను చంపడం వరకే పరిమితమైన నక్సలైట్లు దక్షిణాది రాష్ట్రాల్లో నాయకత్వంపై ఎక్కువగా గురి పెట్టింది. నక్సలైట్లు 2003 అక్టోబర్ 1న అప్పటి ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తిరుమల వద్ద క్లైమోర్ మైన్స్ తో హత్యకు విఫలయత్నం చేసింది. అలాగే రెండేళ్ళ క్రితం మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హత్యకు విఫలయత్నం చేసింది. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేల సంగతి చెప్పనక్కరలేదు. మంగళవారం రాత్రి నుంచి మూడు రోజుల పాటు దండకారణ్యంలతో పాటు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బంద్ కు నక్సల్స్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దేశంలో పలువురు అగ్రనేతలను హెచ్చరిస్తూ చేసిన ప్రకటనలు సీరియస్ గానే పరిగణిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మావోయిస్టుల ఎత్తుగడలపై బాగా అధ్యయనం చేసిన ఆంధ్రా పోలీసులను ఈ విషయమై కేంద్రం సంప్రదిస్తోంది.
Pages: -1- 2 News Posted: 23 July, 2009
|