జైలుకు పంపిన లాటరీ
గత ఆరేళ్లుగా పొలీసులకు దొరకని షెల్ గారి ఆచూకీ ఎలా దొరికిందనా మీ అనుమానం... కెనడాలోని వొంటరియో లాటరీ అండ్ గేమింగ్ (ఓఎల్ జి) నిర్వహించే లాటరీ టిక్కెట్ ను షెల్ కొన్నాడు. అదృష్టం వరించి అది కాస్తా తగిలేసింది. దాంతో నిర్వాహకులు షెల్ ను ఆహ్వానించి చెక్కును అందజేశారు. ఆ సందర్భంలో షెల్ ఛాతీ విరుచుకుని ఫోటోలకు ఫోజులిచ్చాడు. మీడియాలో వచ్చిన షెల్ గారి ముఖారవిందాన్ని గుర్తు పట్టేసిన పోలీసులు హుటాహూటీన అక్కడ వాలిపోయారు. ఆ తర్వాత కథ ముందుగానే మీకు తెలుసు.
ఇప్పుడు షెల్ కోర్టులో ఐదువేల డాలర్ల అక్రమ ఆస్థులను కలిగివున్నాడన్న అభియోగంతో పాటు ఇంతకాలం కోర్టును తప్పించుకున్న నేరారోపణలను ఎదుర్కోవాల్సి ఉంది. అయినా కెనడా లాటరీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. లాటరీ ద్వారా పొందిన సొమ్మును సదరు వ్యక్తి దుర్వినియోగం చేయడని నిర్ధారించుకున్న తరువాతే లాటరీ సొమ్మును అందజేస్తారు. షెల్ ఉదంతం తరువాత లాటరీ నిర్వాహకులు ఒక హెచ్చరికను వెబ్ సైట్లో ఉంచారు. లాటరీని బాధ్యతో ఆడాలని సూచించారు. పౌరులు తాము సంపాదించిన దాని కంటే ఎక్కువ లాటరీ లాంటి జూదాల్లో పెట్టరాదని, అప్పులు చేసి టిక్కెట్లు కొనరాదని, కుటుంబాన్ని ఆకలితో మాడ్చి, లేదా నిర్లక్ష్యం చేసి లాటరీ ఆడరాదని, స్నేహితుల దగ్గర చేబదుళ్ళు తీసుకుని, బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి లాటరీ ఆడరాదని సూచనలు చేసింది. షెల్ లాంటి సంఘటనలు భవిష్యత్ లో జరగకుండా చూస్తామని కూడా లాటరీ నిర్వాహకులు పేర్కోన్నారు. కాగా షెల్ మాత్రం నిజంగానే షాకయిపోయాడు. నేను షాప్ కు వెళ్ళి నా టిక్కెట్ కు లాటరీ తగిలిందని నిర్ధారించుకోగానే దానిపై సంతకం చేసి చెక్ తీసుకున్నాను. కానీ మరుక్షణంలోనే నా చేతులకు బేడీలు పడ్డాయని షెల్ వాపోయాడు.
Pages: -1- 2 News Posted: 24 July, 2009
|