ఎఐసిటియూకి సిబల్ కత్తెర
మంచి ప్రమాణాలతో విద్యను అందించే ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఈ ముందస్తు అనుమతి కోసం ఎదురుచూస్తూ, సకాలంలో అనుమతులు లభించక తమ విస్తరణ కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నాయని, ఇలాంటి ఇబ్బందులను తొలగించడానికే సిబల్ నిర్ణయం తీసుకున్నారని అధికారులు వివరించారు. ఈ నిర్ణయంతో మండలి తనిఖీలు అవసరం లేదని అర్ధం కాదని, కేంపస్ తనిఖీలు తప్పనిసరిగా ఉంటాయని, అయితే మంచి విద్యాసంస్థలు ఎఐసిటియూ అనుమతుల కోసం పడిగాపులు పడే అవస్థ నుంచి తప్పించడానికే ఈ నిర్ణయం అని వారు వివరించారు. సిబల్ నిర్ణయం ప్రమాణాలు పాటించని సంస్థలు ఇష్టారాజ్యంగా విస్తరణ చేసుకోడానికి అవకాశం ఇవ్వదని వారు స్పష్టం చేశారు.ఎందుకంటే తనిఖీ అనంతరం అనుమతి లభించకపోతే అదనంగా చేర్చుకున్న విద్యార్ధులను వెనక్కి పంపాల్సి ఉంటుందని, అప్పుడు యాజమాన్యం విస్తరణ కోసం చేసిన ఖర్చంతా వృధా అవుతుందని వారు పేర్కొన్నారు. కాబట్టి సామర్ధ్యం ఉన్న సంస్ధలే విస్తరణకు ముందుకు వస్తాయని ఆయన అభిప్రాయ పడ్డారు.
చాలా సంస్థలు విస్తరణ కోసం ఎదురు చూస్తున్నాయని, ఎఐసిటియూ అనుమతులు మంజూరు చేయడంలో తీవ్రమైన జాప్యం చేస్తోందని, లంచాల కోసం తమ దరఖాస్తులను తొక్కిపెట్టిందని, త్వరగా అనుమతి కావలంటే ముడుపులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారంటూ సిబల్ కు అనేక ఫిర్యాదులు అందాయని అధికారులు వివరించారు. ఇప్పటికే ఎఐసిటియూ సభ్య కార్యదర్శి కె నారాయణరావును లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేసింది. అలానే మండలి చైర్మన్ రామ్ అవతార్ యాదవ్ పై దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే ఎఐసిటియూ రీసెర్చ్ స్కాలర్లు, బోధనాసిబ్బంది విదేశీ సదస్సులకు వెళ్ళడం కోసం ఇచ్చే దారి ఖర్చుల మంజూరిలో నిబంధనలు పాటించలేదని కాగ్ తాజాగా తప్పుపట్టింది.
Pages: -1- 2 News Posted: 25 July, 2009
|