`గోర్షకోవ్' కొను గోల్ మాల్
ఈ నాలుగేళ్ళలో గోర్షకోవ్ కోసం చేసిన చెల్లింపులతో కొత్త నౌకను చక్కగా కొనుక్కోవచ్చని కాగ్ అధికారి అరవింద్ అవస్థి అన్నారు. ఇది చాలా అసాధారణం. రక్షణ శాఖలో ఇది అతి పెద్ద అనవసర ఖర్చుగా మిగిలిపోవచ్చని ఆయన అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం జరిగినట్లు కనుగొన్నా కాగ్ ఎలాంటి శిక్షలు విధించలేదు కానీ, గతంలో జర్మనీ జలాంతర్గాముల కొనుగోలు, కార్గిల్ యుద్ధంలో చనిపోయిన సైనికుల కోసం కొన్న శవపేటికల కుంభకోణాలను కాగ్ బయటపెట్టిన తరువాతే సిబిఐ దర్యాప్తులు జరిగాయి. ఎమైనా భారత రక్షణ విభాగంలో ఇప్పటి వరకూ అతిపెద్ద కుంభకోణంగా ఉన్న బోఫోర్సు ఒప్పందం కూడా గొర్షకోవ్ ముందు వెలవెలపోకతప్పదని నిపుణులు అంటున్నారు. ఈ ఒప్పందంలో ముడుపులు జరిగాయా? ఈ చెల్లింపుల చెక్కులపై సంతకాలు చేసిందెవరు? అన్నది తేలాల్సి ఉంది.
నౌకా దళం మాత్రం ఈ కొనుగోలులో తన ప్రమేయం లేదని స్పష్టం చేస్తోంది. నౌకా దళం ఎలాంటి కొనుగోళ్ళు చేయదని, ఆర్ధిక లావాదేవీలు నడపదని ఒక అధికారి పేర్కొన్నారు. కొనుగోళ్ళు చేసేది రక్షణ శాఖేనని ఆయన వివరించారు. అయితే రక్షణ శాఖకు చెందిన సీనియర్ అధికారి వివరణ ప్రకారం ఇలాంటి కొత్త నౌకను కొనాలంటే దాదాపు 20 వేల కోట్ల రూపాయలు కావాలి.కాని గొర్షకోవ్ ను 2004లోకేవలం 4,870 కోట్లే చెల్లించాం. అది కూడా నౌక మరమ్మత్తుల కోసం.వాస్తవానికి నౌకను రష్యా మనకు కానుకగా ఇస్తోంది. గొర్షకోవ్ 16 యుద్ధ విమానాలను, ఆరు కమోవ్ హెలికాప్టర్లను తీసుకెళ్ళగలదు. నౌకతో పాటు కమోవ్ హెలికాప్టర్లను కూడా రష్యా మరో 4,395 కోట్ల రూపాయలకే ఇస్తోందని ఆయన వివరించారు. కానీ, నౌక మరమ్మత్తులు, పరీక్షలు అంటూ రష్యా భారత్ నుంచి సొమ్ములు పిండేస్తోందని చెబుతున్నారు.
Pages: -1- 2 News Posted: 25 July, 2009
|