లేడీ అమితాబ్ జంపేనా?
ఇవన్నీ ఇలాఉంటే ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వ్యూహరచన కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి విజయశాంతిని ప్రత్యేకంగాఆహ్వానించారు. అయి నా ఆమె అటువైపు తొంగి చూడకపోవటంతో కెసిఆర్ తీవ్రఅసంతృప్తి వ్యక్తంచేశారు. విజయ శాంతి ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా ఆమె ప్రజా ప్రతినిధి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా తప్పు పట్టాల్సిన పని లేదని సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. మరికొందరు నేతలు సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు. వారంతా ఇప్పుడు విజయశాంతి వ్యవహార శైలి పట్ల తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
విజయశాంతి ఇంత ధైర్యంగా వైఎస్‌ను కలుసుకోవటం, కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపుతు న్నారన్న సంకేతాలను జనంలోకి వెళ్ళేలా చేయటం వెనుక సీనియర్ కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ మారినా ఫిరాయింపుల చట్టం వర్తించే అవకాశం లేదు కాబట్టే ఆమె అంత ధైర్యంగా ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
విజయశాంతి తీరు చూస్తుంటే ఆమె కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా కనిపిస్తున్నదని టిఆర్‌ఎస్ నేతలు కొందరు వ్యాఖ్యానించారు. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వ్యూహంపై జరిగిన సమావేశం సందర్భంగా వారు తమను కలిసిన మీడియాతో మాట్లాడుతూ విజయశాంతి వరుస ఈ మధ్య విచిత్రంగా ఉందన్నారు. ఆమె కాంగ్రెస్ వైపు వెళ్ళినా పార్టీకి పెద్ద నష్టమేమీ లేదని, అలాగే చేస్తే ఎన్నుకున్న ప్రజలకే జవాబు చెప్పుకోవలసి వస్తుందని వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 News Posted: 27 July, 2009
|