గ్రేటర్ కు పవన్ వచ్చేనా?
క్షేత్రస్థాయిలో పటిష్టమైన యంత్రాంగం లేని పిఆర్పీ తొలుత పార్టీ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. చిరంజీవి మినహా ప్రచార కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నా కార్యకర్తల్లో అంత ఉత్సాహం, ఉత్తేజం ఉండదని దీనికి పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపితీనే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ధీటుగా గ్రేటర్ పరిధిలో ప్రచారం నిర్వహించవచ్చనే పార్టీ శ్రేణుల సూచనల మేరకు చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్య పార్టీ వ్యవహారాల పట్ల అంత శ్రద్ధ చూపని పవన్ కళ్యాణ్ ఎన్నికల అనంతరం పార్టీ కార్యాలయానికి కూడా దాదాపుగా రాలేదు.
సినీ రంగంలో ఆయన బిజీగా ఉన్నారు. మరో సోదరుడు నాగేంద్రబాబు కూడా పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం లేదు. పవన్ తో పాటు నాగేంద్ర బాబును కూడా ఎన్నికల ప్రచారంలో వినియోగించుకోవాలని చిరంజీవి యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇరువురూ గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉండాలని నిర్ణయానికి వచ్చినందున చిరంజీవి కూడా దూరంగానే ఉంటేనే బాగుంటుందని పలువురు సీనియర్లు చిరంజీవికి సూచించినట్టు తెలుస్తోంది.
Pages: -1- 2 News Posted: 27 July, 2009
|