మంత్రులకు వాస్తు భయం
ఈ మంత్రులు ఇంత గట్టిగా వాస్తు మార్పులు కోరడానికి తగిన కారణం ఉందట. గతంలో ఈ అధికార నివాస గృహాల్లో ఉన్న మంత్రులు మారెప్ప, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ మొన్నటి ఎన్నికల్లో పాపం చిత్తుగా ఓడిపోయారు. ఈ మంత్రుల బాధ ఇదైతే ఆర్ అండ్ బి అధికారు బాధ మరోలా ఉంది. ఐదేళ్లకోసారి మంత్రులు మారినప్పుడల్లా వాస్తు పేరుతో ఇలా మార్పులు చేసుకుంటే పోతే ఈ భవనాలు బలహీనపడిపోయి ఎప్పుడో ఒకప్పుడు కుప్పకూలిపోవడం తధ్యమని అంటున్నారు. కానీ తమ చేతుల్లో ఏదీ లేదని వారు వాపోతున్నారు.
అదలా ఉంచితే ఈ వాస్తులకు, జ్యోతిష్యం వంటి నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే సెంటర్ ఫర్ ఎంక్వైరీ కి చెందిన ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం ఆర్ధిక మంత్రి రోశయ్యను కలిశారు. ప్రభుత్వ భవనాలకు, కార్యాలయాలకు వాస్తు పేరుతో మరమ్మతులు చేయకుండా నిరోధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. తరచు ఇలా వాస్తు నమ్మకాల కోసం మరమ్మతులు చేయడం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన రోశయ్యకు కూడా నచ్చింది. ఆయన సానుకూలంగానే స్పందించారు. కానీ, కొసమెరుపు ఏమిటంటే మంత్రుల కోరిక మేరకు వారికి కేటాయించిన భవనాలకు వాస్తురీత్యా మార్పులు చేయడానికి ప్రభుత్వం 42 లక్షల రూపాయలను కేటాయించడమే.
Pages: -1- 2 News Posted: 28 July, 2009
|