కోటిన్నర జీతం ఎవరిది?
అనేక సంవత్సరాలుగా సహేర్ కు తాజ్ చాలా ఆకర్షణీయమైన ఇంక్రిమెంట్లతో గౌరవించింది. 2003-04 సంవత్సరంలో అతని జీతం సంవత్సరానికి 68 లక్షల 34 వేలు. 2005లో అది 87 లక్షల 51 వేలు అయింది. 2006-07లో ఒక్కసారిగా కోటీ 39 లక్షలకు చేరుకుంది. 2007-08లో దానిని కోటీ 48 లక్షల రూపాయలకు పెంచారు. తాజా తాజ్ వార్షిక నివేదిక నివేదిక ప్రకారం ప్రస్తుతం సహేర్ జీతం కోటీ 52 లక్షల రూపాయలుగా పేర్కొన్నారు. ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పదవికి తాను పొందుతున్న వేతనానికి సంబంధం లేదని సహేర్ సవినయంగా చెబుతున్నాడు.
తాజ్ లో సహేర్ చాలా గౌరవప్రదమైన ఉద్యోగి. తాజ్ యాజమాన్యానికి అనేక సంవత్సరాలుగా విలువైన సేవలు అందిస్తున్న వ్యక్తని చెబుతున్నారు. అతని వేతనాలకు సంబంధించినంత వరకూ వార్షిక నివేదకలో పేర్కొన్నదాని కంటే ఇతర వివరాలను వెల్లడించలేమని, అది కంపెనీ నియమాలకు విరుద్ధమని తాజ్ అధికారులు తెలిపారు. తాజ్ హోటల్ లో వినియోగించే అన్ని రకాల వస్త్రాల పరిశుభ్రతను కాపాడటంలో సహేర్ తన బాధ్యతలను అమోఘంగా నిర్వర్తిస్తాడని ఆయన సహోద్యోగులు గర్వంగా చెబుతారు. సహేర్ తో పాటు తాజ్ లో చేరిన చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు అధికారులుగా మారారు. పెద్దపెద్ద స్థాయిల్లో ఉన్నారు. కాని వారి వేతనాలు సహేర్ కంటే తక్కువ గానే ఉన్నాయి. తాజ్ మహల్ పేలస్, టవర్ హోటళ్ళ లగ్జరీ డివిజన్ కు ముఖ్య ఛెఫ్ గా ఉన్న హేమంత్ ఒబరాయ్ 1974లో సహేర్ కంటే కేవలం ఆరునెలల తరువాత తాజ్ లో చేరారు. ఉద్యోగ స్థాయి పెరిగింది కానీ వేతనం మాత్రం సంవత్సరానికి 93 లక్షలే అందుకుంటున్నారు.
తాజ్ బ్రాండ్ తో దేశంలో అనేక హోటళ్ళను నడుపుతున్న ఇండియన్ హోటల్ కంపెనీ తన వార్షిక నివేదికలో అత్యధిక వేతనాలు అందుకుంటున్న 131 మంది ఉద్యోగలు పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో కేవలం ముగ్గురు మాత్రమే సహేర్ కంటే ముందున్నారు. వారిలో హోటల్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ బిక్సన్ ఐదు కోట్ల 30 లక్షల రూపాయలతో అగ్రస్థానం పొందారు. రెండు కోట్ల 30 లక్షల రూపాయల వేతనంతో లగ్జరీ ఇంటర్నేషనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పౌపన్ యాన్నిక్ రెండో స్థానంలోనూ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ముఖ్య సమాచార అధికారి ప్రకాష్ శుక్లా కోటీ 67 లక్షల రూపాయల జీతంలో మూడో స్థానంలో ఉన్నారు.
Pages: -1- 2 News Posted: 29 July, 2009
|