దేశానికి కానుకగా గాంధీ ఇల్లు
`ఈ ఇల్లు అమ్మకానికి పెట్టినప్పుడు ఎవరూ కొనడానకి ముందుకు రావడం లేదన్న సంగతి తెలిసి నేను చాలా బాధపడ్డాను. అసలు భారత ప్రభుత్వం ఈ ఇల్లు కొనాలన్న ఆలోచన కూడా చేయనందుకు నాకు విస్మయం కలిగింది. ఈ ఇల్లు గాంధీ యుగానికి ప్రతీక. ఇది భారత జాతి ప్రతిష్టకు సంబంధించిన అంశంగా భావించాను' అని ప్రదీప్ భవాని పేర్కొన్నారు. గత పాతికేళ్లుగా ఈ ఇంట్లో యజమానురాలు, అమెరికా కళాకారిణి నాన్సీ బాల్ నివాసం ఉన్నారు. ఆమె ఇంటిని అమ్మకానికి పెట్టినప్పుడు ఎవరూ దానిని కొనడానికి ఆసక్తి చూపలేదు. కానీ, గాంధీ ఒకప్పుడు నివసించిన ఇల్లుగా ప్రచారం జరిగిన తరువాత కొంతమంది దాని వివరాలు అడిగారు. ప్రదీప్ భవానీ మాత్రం నాన్సీ బాల్ తో అప్పుడే సంప్రదింపులు ప్రారంభించారు. ఈ ఇంటిని తనకు అమ్మితే దానిని తాను గాంధీ మ్యూజియంగా తీర్చిదిద్దుతానని ఆమెకు ప్రతిపాదించారు.
ఈ ఇంటిని నాన్సీ తనకే అమ్ముతారనే నమ్మకంతో ప్రదీప్ ఉన్నారు. ఆయన ఇప్పటికే జొహెన్నెస్ బర్గ్ చేరుకున్నారు. ఆదివారం నాడు క్రయపత్రాలు రాసుకుంటారు. దానిలో తాను ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి కొనుకోలు చేసిన గాంధీ కి చెందిన 34 వస్తువులను భద్రపరచి దానిని మ్యూజియంగా మారుస్తారు. ఆ తరువాత గాంధీ జయంతి రోజైన అక్టోబర్ రెండో తేదీన మ్యూజియంను ప్రారంభిస్తారు. ఆదే రోజు దానిని భారత ప్రభుత్వానికి కానుకగా ఇస్తారు. ఇంటి తాళాలను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు అందజేయాలని ప్రదీప్ భవానీ భావిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 1 August, 2009
|