ని`స్సహాయ' మంత్రులు
ఈ మంత్రుల పనితీరుపై ఎలాంటి ఫిర్యాదులూ లేవని, కానీ, తమకు అవకాశం ఇస్తే మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేస్తామన్నదే జూనియర్ల వాదనని ఓ సీనియర్ మంత్రి చెప్పారు. ఐటి టెలికాం సహాయ మంత్రి కామత్ తనకు తన సీనియర్ ఎ రాజా చాలినంత పని ఇవ్వట్లేదని సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. కామత్ కు పోస్టల్ డిపార్టుమెంటును అధికారికంగా కేటాయించారు. ఇటీవల దేశంలో ఐదువందల తపాలా కార్యాలయాలను సాంకేతికంగా అభివృద్ధి చేసే ప్రాజెక్టును మాత్రం మరో సహాయ మంత్రి సచిన్ పైలెట్ కేటాయించారని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మకెన్ పరిస్థితి కూడా ఇలానే తయారైందట. ఈయనకు అధికారికంగా నక్సలైట్ సమస్య, మానవ హక్కుల ఉల్లంఘన అంశాలను కేటాయించారు. కాని నక్సలైట్ సమస్యను హోం మంత్రి చిదంబరమే స్వయంగా చూస్తుండటంతో అజయ్ కు ప్రస్తుతం పని లేకుండా పోయింది.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ అయితే యూపియే పెద్దలకు కచ్చితంగా చేప్పేశారట. తమ పార్టీకి ఇచ్చిన సహాయ మంత్రులకు బాధ్యలు అప్పగించకపోతే మర్యాదగా ఉండదని. తమ పార్టీకి చెందిన మంత్రులను సీనియర్లు పట్టించుకోవడం లేదని ఆమె తేటతెల్లం చేశారు. రాహుల్ గాంధీకి సన్నిహితునిగా పేరుపొందిన ప్రదీప్ జైన్ పరిస్థితీ కుడితిలో పడ్డ ఎలకలానే ఉంది. గ్రామీణాభివృద్ధి కేబినెట్ మంత్రి ఈ సహాయకుని సేవలు అస్సులు వినియోగించుకోవడం లేదట. అందరిలోకి ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ అజాద్ ఒక్కరే తన జూనియర్ మంత్రులకు చేతి నిండా పని కల్పిస్తున్నారు. గతంలో ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా ఉన్న పనబాక లక్ష్మీ ఈసారి జౌళి శాఖలో సంతోషంగానే ఉన్నారు. గతంలో కంటే ఇప్పుడు మెరుగని, చేయడానికి పని ఉందని ఆమె చెప్పారు.
Pages: -1- 2 News Posted: 11 August, 2009
|