యాదవ్ పై ఎంపీల ప్రేమ ఈ యాదవ్ అనుకూల ఎంపీల బృందంలో ఉన్నవారి పేర్లు చూస్తే ఆశ్చర్యం తప్పదు. సమాజ్ వాది పార్టీ ఎంపీ జయప్రద, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ మంత్రి హర్ష కుమార్, చింతా మోహన్, జెడి(యు) ఎంపీ దినేష్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. ప్రధాని కార్యాలయానకి రాసిన లేఖ మన హనుమంతరావు లెటర్ హెడ్ పై తయారు చేశారు. ఈ లేఖలో యాదవ్ గారి గుణగణాలను వేయి నోళ్ళ కీర్తించారు. దేశంలో పది లక్షల ఇంజనీరింగ్ సీట్లు అదనంగా రావడానికి, రిక్షావాని కొడుకు కూడా ఇంజనీర్ కావడానికి యాదవ్ చేసిన కృషే కారణమని, ఆయనకు అన్యాయం జరిగిందని లేఖలో మన ఎంపీలు వాపోయారు. ఏకంగా 47 మంది ఎంపీలు ఈ లేఖపై చేవ్రాలు చేసి యాదవ్ కు కితాబు ఇచ్చారు.
`అబ్బే నాకు యాదవ్ ఎవరో తెలీదు. ఎప్పుడూ చూడనుకూడా లేదు. సాటి ఎంపీ చింతా మోహన్ వచ్చి నిజాయితీ పరునికి అన్యాయం జరిగిందని చెబితే ఆ లేఖపై సంతకం చేశా'నని రాయపాటి చెప్పారు. నా బాధ అంతా మన రాష్ట్రానికి చెందిన నారాయణరావు గురించే. మంచి కుటుంబానికి చెందిన అతనికి ఇలా జరగడం దురదృష్టకరమని రాయపాటి ముక్తాయింపు ఇచ్చారు. మండలి వైస్ చైర్మన్ చేసిన కుట్రకు వీరంతా బలయ్యారని, అర్జున్ సింగ్ హయాంలో పదవిలోకి వచ్చిన యాదవ్ తొలగింపు వెనుక రాజకీయ కుట్ర కూడా ఉందని అంటున్నారు.
Pages: -1- 2 News Posted: 11 August, 2009
|