ఓ `మగధీరు'ని విషాదం
ఉన్నత చదువులపై దృష్టి సారించిన ప్రవీణ్ ఎన్ఐటి ప్రవేశ పరీక్ష రాస్తే జాతీయ స్థాయిలో మూడో ర్యాంకుతో టాపర్ గా నిలిచాడు. అంతేకాదు ఒక ఎంఎన్ సి కంపెనీ ఏడాదికి సుమారు ఎనిమిది లక్షల రూపాయల జీతంతో ఉద్యోగం కూడా ఇచ్చింది. ఈ ఆనందంలోనే స్నేహితుల కోరిక మీద మగధీర సినిమాకు వెళ్ళాడు. టికెట్ కొనడానికి కూడా ప్రవీణ్ డబ్బులు తీసుకెళ్ళలేదని, స్నేహితులే టికెట్ కొంటామన్నారు. పిల్లల చదువు కోసం వెంకటేశం దంపతులు అప్పుల పాలైపోయారు. సొంత ఊర్లో ఉన్న చిన్నగుడిసెను కూడా అమ్మేశారని బంధువులు చెబుతున్నారు.
ప్రవీణ్ మరణం తరువాత పరిణామాలు మనలోని మానవత్వాన్ని ప్రశ్నించేవిగానే ఉన్నాయి. విద్యాధికుడైన యువకుడు పేదవాడు కావడంతో పెద్దలు చేతులు దులుపుకునే వైఖరినే ప్రదర్శించారు. సూరత్ నుంచి తండ్రి రాకపోవడంతో పోస్టు మార్టం అనంతరం ప్రవీణ్ మృతదేహాన్ని తీసుకువెళ్ళే ఆర్ధిక స్థోమత తల్లికి లేకపోయింది. ఒకవేళ తీసకువెళ్ళినా ఎక్కడ ఉంచాలో, ఎలా కొడుకు దేహాన్ని కాపాడాలో తెలియక ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఆసుపత్రి మార్చురీలోని ఐస్ బాక్స్ లోనే ఉంచాలని, తండ్రి వచ్చిన తరువాత తీసుకెళతామని ప్రాధేయపడింది. ఆసుపత్రి అధికారులు కనికరించారు. కాని విషయం తెలుసుకున్న విద్యార్ధీ సంఘాలు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగాయి. ప్రవీణ్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలన్నది వారి ఉద్దేశం. ఆందోళన ద్వారా సినిమా నిర్మాత, థియేటర్ యజమాని, అధికారులపై ఒత్తిడి తేవాలని వారు ప్రయత్నించారు. కానీ, పోలీసులు దీనిని మరో కోణంలో చూశారు. లాఠీ ఛార్జీ చేసి విద్యార్ధులన తరిమేయడమే కాకుండా మళ్ళీ విద్యార్ధలు ఆందోళన చేస్తారన్న అనుమానంతో రాత్రి వేళ ప్రవీణ్ మృతదేహాన్ని తీసుకుపోవాలని ఆ తల్లిపై వత్తిడి తెచ్చారు.
మేధావైన ఒక యువకుడు అన్యాయంగా చనిపోతే, ఒక కుటుంబం ఆశలు నిలువునా కూలిపోతే సినిమా నిర్మాత లక్ష రూపాయలు, థియేటర్ యజమాని లక్ష రూపాయలు, ఆపద్బంధు పథకం కింద లక్ష రూపాయలు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. సామాజిక న్యాయం కోసం, మార్పుకోసం మానవత్వంతో ముందుకొచ్చిన మహానుభావులెవరికీ ప్రవీణ్ కుటుంబం కనిపించలేదు.ప్రవీణ్ ప్రతిభకు, అతను పేదరికాన్ని సవాలు చేసిన లక్ష్యానికి న్యాయం చేయడానికి వారెవరూ ముందుకు రాలేదు.
Pages: -1- 2 News Posted: 13 August, 2009
|