నకిలీ నోట్లతో ఉగ్రవాదుల దాడులు 2007లో దుబాయికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ.2.36 కోట్ల విలువైన 'నగదు' ను స్వాధీనం చేసుకున్నారు. 2008లో 304 నకిలీ నోట్ల కేసులకు గాను 20 కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలైంది. 212 కేసుల విచారణ కొనసాగుతోంది. 72 కేసుల్లో ఎవర్నీ దోషలుగా గుర్తించలేదు. 19 కేసులు విచారణకు ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నకిలీ కరెన్సీ నోట్ల కేసులు ఏటా 66 శాతం పెరుగుతున్నాయి. ఒక్క ఏడాదికి 343 కేసుల వరకు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లా, హైదరాబాద్ ల్లో నకిలీ నోట్ల పర్వం పట్టపగ్గాలు లేకుండా సాగుతోందని అధికారుల అంచనా. అసలు నోట్లకు - నకిలీ నోట్లకు తేడాలను గుర్తించడం చాలా కష్టమని, సామాన్య పౌరులైతే అసలు గుర్తించలేరని ఒక పోలీసు అధికారి చెప్పారు.
తనిఖీ యంత్రాలు అవసరం : ఆర్ బి ఐ
నకిలీ నోట్లను గుర్తించడానికి అవసరమైతే తనిఖీ యంత్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకులను ఆదేశించింది. కరెన్సీ పంపిణీలో విధి విధానాలపై ఉన్నతస్థాయి కమిటీకి నాయకత్వం వహిస్తున్న డిప్యూటీ గవర్నర్ ఉషా తోరత్ ఈ మేరకు ఆదేశించారు. బ్యాంకులతో పాటు ఏటిఎం సెంటర్లలోకూడా ఈ నకిలీ నోట్లు రాకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. ఇందుకోసం నకిలీ నోట్లను గుర్తించే విధంగా ఏటిఎంలను నిర్మిస్తున్నారు. పాత ఏటిఎంలకు ఈ సౌకర్యం కల్పించనున్నారు. వ్యాపార, ఆర్థిక సంస్థలు కూడా నకిలీ నోట్లను గుర్తించే యంత్రాలను నెలకొల్పుకోవాలని ఉషా కమిటీ సూచించింది.
Pages: -1- 2 News Posted: 19 August, 2009
|