శివమెత్తిన చిరు!
'ప్రజారాజ్యం రాజకీయ కూడలిలో నిలబడిందని, తొలి పుట్టినరోజు పూర్తి చేసుకోక ముందే తన పయనమెటో తేల్చుకోవాల్సిన సంకట పరిస్థితిని ఎదుర్కొంటోందని, అధికార పార్టీ పాత్ర నిర్వహించే అవకాశం కనుచూపు మేరలో కనబడడం లేదని భావిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు బుధవారం రాత్రి పిఆర్పీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ ను కలిసి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేద్దామని ప్రతిపాదించారని, కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్న భూమా నాగిరెడ్డి -,శోభా నాగిరెడ్డి దంపతులు, ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి ఈ సమావేశానికి హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంద'ని కథనాన్ని ప్రధాన వార్తగా ప్రచురించింది. ఇలాంటి వార్తా కథనాలు ప్రచురించడం ద్వారా ప్రజారాజ్యం పార్టీలో అయోమయాన్ని సృష్టించి, బలహీనపరిచే హీనమైన చర్యలకూ ఈనాడు పాల్పడుతోందని చిరంజీవి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు.
ఇక ఆంధ్రజ్యోతి కథనానికి సంబంధించి, ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలపైనే ముఖ్యమంత్రి గురిపెట్టారని, కర్నూలు జిల్లాకు చెందిన పిఆర్పీ ఎమ్మెల్యేలు గంపగుత్తగా కాంగ్రెస్ లో చేరిపోయేందుకు యత్నిస్తున్నారని, బనగానపల్లికి చెందిన పిఆర్పీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆయన సోదరుడు ఈ విషయమై చర్చిస్తున్నారని, నెల్లూరు సహా ఇతర జిల్లాల్లోని పిఆర్పీ ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ లో చేరిపోతున్నారంటూ వార్తా కథనం ప్రచురించింది. ఇంతటితో ఆగకుండా 'గాలాలకు ఎర పట్టించి చెరువులో ఉంచాం. ఏ గాలానికి ఏ చేప తగులుతుందో చూద్దాం' అంటూ నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి వ్యాఖ్యానించినట్లు కూడా తన కథనానికి సాక్ష్యంగా ఆంధ్రజ్యోతి వార్త ప్రచురించింది. తెలుగుదేశం కంటే ప్రజారాజ్యం ఎమ్మెల్యేలపైనే తమ పార్టీ పూర్తిగా దృష్టి సారించిందంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారంటూ కూడా కథనంలో ఆంధ్రజ్యోతి ఉటంకించింది. ఇలా ఆ రెండు పత్రికలూ తమ పార్టీపై కుట్ర పన్నాయని పిఆర్పీ అధినేత, ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు.
Pages: -1- 2 News Posted: 20 August, 2009
|