ఇది పేదల భారతం తాజాగా ఎస్ డి టెండూల్కర్ నాయకత్వంలోని ఈ కమిటీ కొత్త విధానంలో పేదరికాన్ని మదింపు వేసింది. ప్రాధమిక అంచనాల ప్రకారం దేశ జనభాలో 38 శాతం మంది ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువనే బతుకుతున్నారని నివేదిక రూపొందించారు. అయితే మొన్నటి జూన్ నెలలో ఎన్ సి సక్సేనా నాయకత్వలోని ప్రభుత్వ కమిటీ దేశంలో పేదల శాతం యాభైగా నిర్ధారించింది. నేషనల్ కమిషన్ ఫర్ ఎంటర్ ప్రైజెస్ ఇన్ అనార్గనైజ్డ్ సెక్టార్ సంస్థకు చెందిన అర్జున్ సేన్ గుప్త పేదరికం 77 శాతంగా ఉందని ప్రకటించారు. ప్రభుత్వం ఈ రెండు అంచనాలనూ కొట్టివేసింది.2007లో ప్రణాళికా సంఘం ఈ శాతాన్ని 28.5 గా అంచనా వేసింది.
పేదరికాన్ని అంచనావేయడానికి అనుసరించిన కొత్త పద్దతి సంక్లిష్టమైన శాస్త్రీయతో కూడుకున్నదని ప్రణాళికాసంఘంలోని గ్రామీణ అభివృద్ధి విభాగం సభ్యుడు మిహిర్ షా అన్నారు. కాని పేదరికం 38 శాతం అన్న అంచనాతో ఆయన ఏకీభవించలేదు. కానీ 28.5 శాతం కంటే ఎక్కువే ఉండవచ్చని అంగీకరించారు. ప్రస్తుతం పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ 28.5 శాతం అంచనాను అనుసరించే సాగుతున్నాయి. దారిద్ర్యరేఖకు దిగువున జీవిస్తున్న పేదల కోసం కేంద్రం లక్షా 51వేల 460 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని, పేదరిక శాతం అంచనా పెరిగితే దానికి అనుగుణంగా నిధులు కేటాయించాల్సి ఉంటుందని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు.
టెండూల్కర్ కమిటీ అంచనా ప్రకారం దేశంలో 8.32 కోట్ల కుటుంబాలు దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నాయి.జాతీయ ఆహర భద్రత చట్టం ప్రకారం వీరి కోసం అదనంగా 9 వేల 500 కోట్ల రూపాయలు ఆహర సబ్సిడీగా ఇవ్వాలని ప్రభుత్వం అంచనా వేసింది. వచ్చేసంవత్సరానికి ఇది 37 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని ఆయన తెలిపారు.
Pages: -1- 2 News Posted: 20 August, 2009
|