మాజీ ఐటీల క్రెడిట్ తిప్పలు మొదట తాము ఖాతాదారుని క్రెడిట్ కార్డును బ్యాంక్ కు అప్పగిస్తామని, అలానే ఖాతాదారుని ప్రస్తుత పరిస్థితి గురించి బ్యాంకు అధికారులకు వివరిస్తున్నామని గిదప్ప చెప్పారు. కొన్ని సందర్భాలలో బ్యాంకర్లు బకాయిదారులతో మాట్లాడుకుని ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కారాలు చేసుకుంటున్నాయని అన్నారు. మిగతా కేసులలో కోర్టులను ఆశ్రయించక తప్పడం లేదని వివరించారు. క్రెడిట్ బకాయిదారులకు ఏమైనా ఆస్తులు ఉన్నప్పుడు లేదా దాచుకున్న మొత్తాలు గురించి తెలిసినప్పుడు, జీవిత భాగస్వామి ఉద్యోగి అయినప్పుడు వేధింపులు మరీ అన్యాయంగా ఉంటున్నాయని ఆయన తెలిపారు. బెంగుళూరుకు చెందిన కెవి శేఖర్ ఒక ఐటి కంపెనీలో ప్రొడక్ట్ మేనేజరుగా పనిచేసే వాడు. ఆయన ఉద్యోగం పోయింది. కాని బ్యాంకు ఎజెంట్లు శేఖర్ తండ్రిని బకాయిలు తీర్చమని వేధింపులు ప్రారంభించారు. శేఖర్ చివరకు అసోసియేషన్ ను ఆశ్రయించవలసి వచ్చిందని గిదప్ప చెప్పారు.
బకాయిదారుల విషయంలో చట్టంలో ఉన్న నిబంధనల్లో స్పష్టత లేకపోవడంతో బ్యాంకర్లు ఈ చర్యలకు దిగుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగం పోయి మరో ఉద్యోగం వచ్చిన సందర్భాల్లో బ్యాంకుల వ్యవహారం మరీ ఘోరంగా ఉందని, కొత్త ఉద్యోగంలో వచ్చిన మొత్తం జీతాన్ని బకాయిల కింద బ్యాంకులు లాగేసుకుంటున్నాయని అరుణ్ అనే ఈ తరహ ఖాతాదారుడు వివరించాడు. కొత్త ఉద్యోగం ఎకౌంట్ కూడా పాత బ్యాంకులోనే ఉందని, తన కుటుంబ పోపణ కోసమైనా నయాపైసా కూడా ఉంచకుండా మూడు నెలల తర్వాత వచ్చిన కొత్త జీతాన్ని మొత్తం బ్యాంకు క్రెడిట్ కార్డు బకాయి కింద ఉంచేసుకుందని వాపోయాడు.
Pages: -1- 2 News Posted: 21 August, 2009
|