విఫలమైన 'పాన్'
2007-08 సంవత్సరంలో ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నుల ద్వారా వసూలైన మొత్తం రూ. 3.12 కోట్లు ఉన్నప్పటికీ అది అధిక విలువ గల లావాదేవీల భారీ పరిమాణానికి తగినట్లుగా లేకపోవడం కూడా ఐటి శాఖ అనుమానాలను మరింత పెంచింది.
లావాదేవీలపై కూలంకషమైన దర్యాప్తు నిర్వహించి, వాటి అసలు లబ్ధిదారులతో ముడిపెట్టడం జరిగితే ప్రభుత్వానికి మరింతగా ఆదాయం లభిస్తుందని ఐటి శాఖ భావిస్తున్నది. అయితే, తమ వద్ద ఉద్యోగుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఇంత భారీ స్థాయిలో దర్యాప్తు జరపడం అసాధ్యమని ఐటి శాఖ వర్గాలు అంగీకరించాయి. ఐటి శాఖ ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయింది.
మరింత దర్యాప్తు కోసం ఐటి శాఖకు ఎఐఆర్ లను అందజేస్తుంటారు. సేవింగ్స్ బ్యాంకు ఖాతాలలో రూ. 10 లక్షలు, అంతకు మించిన నగదు డిపాజిట్లు, రూ. 30 లక్షల పైన స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం, రూ. 5 లక్షలకు పైన బాండ్లు, డిబెంచర్ల కొనుగోలు, షేర్ల లావాదేవీలు, రూ. 2 లక్షలు, ఆపైన క్రెడిట్ కార్డు ఖర్చులు వంటివి ఈ ఎఐఆర్ లలో పొందుపరుస్తుంటారు.
ఎఐఆర్ లలోని సమాచారం అంతటినీ మదింపు వేసి, ఐటి దర్యాప్తులో విశ్లేషించవలసి ఉంటుంది. ఈ అధిక విలువ గల లావాదేవీలలో ఉటంకించిన పాన్ నంబర్లపై అసెస్సీల ఐటి రిటర్న్ లతో వాటిని సరిచూడవలసి ఉంటుంది.
ఎఐఆర్ ల ఆధారంగా ఐటి శాఖ గడచిన మూడు సంవత్సరాలుగా ఉన్నత స్థాయి వ్యక్తుల వివరాలను రూపొందిస్తున్నది. ఈ ప్రాజెక్టును '360 డిగ్రీల ప్రొఫైల్స్'గా పేర్కొంటుంటారు. ఈ జాబితాలో రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, రక్షణ శాఖ ఏజెంట్లు, ఉన్నత స్థాయి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ లు, అసాధారణ రీతిలో ఆదాయం వృద్ధి గల వాణిజ్యవేత్తలు, తమ ఆదాయ వనరులకు మించిన విలాసవంతమైన జీవన సరళి గల వ్యక్తుల పేర్లు ఉంటాయి.
Pages: -1- 2 News Posted: 24 August, 2009
|