రాహుల్ కు 'పవర్' లాభించేనా? ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రధాని మన్మోహన్ సింగ్ - రాహుల్ గాంధీ మధ్య వ్యవస్థాగతంగా 'అనుసంధానకర్త' ప్రతిపాదనను అమలు చేసే అవకాశాలను కాంగ్రెస్ వర్గాలు పరిశీలిస్తున్నాయి. ఈ పాత్ర పోషణకు ఐఏఎస్ అధికారి పులక్ ఛటర్జీ పేరుని పార్టీ వర్గాలు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. 1974 బ్యాచ్ కి చెందిన ఈ ఐఏఎస్ అధికారి యూపీఏ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) కార్యదర్శిగా పనిచేశారు. ఈయనకు సోనియాతో సత్సంబంధాలు ఉన్నాయి. పులక్ ఛటర్జీ గతంలో రాయబరేలీ కలెక్టర్ గా పని చేసినపుడు రాజీవ్ గాందీ దృష్టిని ఆకర్షించారు. 1999లో సోనియా గాంధీ ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు ఆమెకు ప్రత్యేక అధికారిగా ఛటర్జీ నియమితులయ్యారు. అనంతర కాలంలో పీఏంఓ, సోనియా మధ్య 'అదృశ్య' అనుసంధాన కర్తగా పనిచేశారు.
పీఎంఓకి - సోనియాకు మధ్య ప్రస్తుతం ఆ స్థాయిలో పనిచేసే 'సంధానకర్త' లేరు. సహాయమంత్రి పృధ్వీరాజ్ చవాన్ ను పీఎంఓలో నియమించినా అది కేవలం పార్టీలో అధికార కేంద్రాల మధ్య సమతుల్యం కోసం జరిగింది! ప్రభుత్వ నిర్ణయాల అమలులో రాహుల్ గాంధీ అభిప్రాయం కోసం ప్రధాని మన్మోహన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనడంలో సందేహం లేదు. యూపీఏ మొదటిసారి అధికారంలోకి ఉన్నప్పుడు రాహుల్ అభిప్రాయాలుకు అనుగుణంగా ఉపాధిహామీని అన్ని జిల్లాల్లో విస్తరించాలన్న నిర్ణయాన్ని ప్రధాని తీసుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఈ పధకమే భారీగా ఓట్లను రాల్చిందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో సొంతంగా అధికారం సాధించేందుకు కాంగ్రెస్ కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ప్రజల్లో ఆకర్షణ కలిగిన నేతల మద్దతు పార్టీకి, ప్రభ్వానికి అవసరమవుతుంది. ఇందుకోసం రాహుల్ వంటి యువనేత అండదండలు ప్రభుత్వానికి అవసరమన్న విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు గుర్తించాయి.
Pages: -1- 2 News Posted: 26 August, 2009
|