హిజ్రాలకు పెళ్ళి వెబ్ సైట్ స్వలింగ సంపర్కం నేర పరిధిలోకి రాదని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత దేశంలో లైంగిక సంబంధాల విషయంలో ఉన్న లక్ష్మణరేఖల రూపు మారుతోందని, తృతీయలింగం మనుషులను అంగీకరించడానకి, తిరస్కరించడానికి మధ్య చాలా సున్నితమై పరదాలు మాత్రమే అడ్డు ఉన్నాయని ఆమె చెబుతోంది. లిఖితపూర్వక చరిత్ర ప్రకారం భారతీయ సమాజంలో నాలుగు వందల యేళ్ళుగా హిజ్రాలుకు స్థానం ఉంది. కానీ దేశంలో ఉన్న రెండు లక్షల మంది ఇప్పటికీ వేధింపులను ఎదుర్కుంటూనే ఉన్నారని కల్కి అభిప్రాయపడింది.
`పురుషులు లైంగికంగా మమ్మల్ని వాడుకుని దోచుకుంటున్నారు. కాని సమాజం తిరస్కరిస్తోంది. కానీ మేము కూడా స్త్రీలమే. మాకూ వివాహం చేసుకునే హక్కు, పిల్లలను పెంచుకునే హక్కూ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది తృతీయలింగ స్త్రీలు పురుషులతో కలిసి జీవిస్తున్నారు. కాపురాలు చేస్తున్నారు. కాని వాళ్ళు బయటపడటం లేదు. ఎక్కువగా తృతీయలింగ స్త్రీలు జన్మత: పురుషులే. కానీ వారు తమను స్త్రీలుగానే భావిస్తారు. తమలో తాము స్త్రీనే చూసుకుంటారు. ఇలాంటి వారికి సాధారణ ఉద్యోగాలు ఇవ్వరు. దాంతో వాళ్లు చిన్నచిన్న దొంగతనాలకు, అడుక్కోడానికి, వ్యభిచారానికి దిగుతార'ని కల్కి వివరించారు. హిజ్రాలైన నేరానికి చట్టపరంగా ఎలాంటి గుర్తింపు లేదని, ఆస్తిహక్కుగాని, పెళ్ళి చేసుకునే హక్కుగాని, ఓటు వేసే హక్కుగాని, కనీసం దేశ పౌరసత్వం సూచించే ఎలాంటి అధికార ధృవీకరణ కూడా లేదని ఆమె వాపోయారు. కాగా వీరికి పెళ్ళి సంబంధాలు కుదర్చడానకి ప్రత్యేకమై వెబ్ సైట్ ఏర్పాటు చేయడం ఆహ్వానించతగ్గ పరిణామమని ఇండియా నాజ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఆరిఫ్ జాఫర్ అన్నారు.
Pages: -1- 2 News Posted: 27 August, 2009
|