శ్రీమతుల వల్లే విభేదాలు! ఇంతగా ఆస్తిపాస్తులున్నా అంబానీ సోదరులు కేజీ గ్యాస్ బేసిన్ లో గ్యాస్ సరఫరా వివాదంపై ఘర్షణకు దిగడం కేంద్రానికి ఆందోళన కలిగిస్తోంది. 2005లో సోదరుల మధ్య వాటాల పంపిణీకి కేంద్ర మంత్రులే జోక్యం చేసుకున్నారు! తిరిగి అటువంటి పరిస్థితి ఏర్పడుతోందని పలువురు భావిస్తున్నారు.
ముఖేష్ కంపెనీ ఆర్ ఐఎల్ వెలికి తీస్తున్న గ్యాస్ ను అనిల్ విద్యుత్ కంపెనీకి డిస్కౌంట్ రేట్ లో అమ్మే విషయంపై వివాదం తలెత్తింది. ఈ విషయంలో కేంద్ర పెట్రోలియం మంత్రి మురళీదేవర ముఖేష్ కొమ్ము కాస్తున్నారని కూడా అనిల్ ఆరోపించాడు! గత వారంలో 33 జాతీయ పత్రికల్లో ఒక పేజీలో ఇచ్చిన ప్రకటనల్లో తన షేర్ హోల్డర్ల నుంచి అభిప్రాయాలను అనిల్ ఆహ్వానించారు. 'ప్రభుత్వం జోక్యం చేసుకుని వినియోగదారులకు ధరలు తగ్గించాలి లేదా తన ఆదాయాన్ని పెంచుకోవాలి. దురదృష్ట వశాత్తు కేంద్ర పెట్రోలియం శాఖ అలా వ్యవహిరంచలేదు. ఆర్ ఐఎల్ మాత్రమే ఏకైక లభ్యదారునిగా మిగిలింది' అని ఈ ప్రకటనల్లో అంబానీ పేర్కొన్నారు. కంపెనీల మధ్య ఇటువంటి ఆరోపణలపై ఇలా బహిరంగంగా వాటాదారుల నుంచి స్పందనను కోరడం దేశంలో ఇదే ప్రధమం.
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అంబానీ సోదరులు తమ మధ్య విభేదాలు పరిష్కరించుకోవాలని ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం రాత్రి విజ్ఞప్తి చేశారు. 'నేను వారిద్దరినీ చిన్నప్పటి నుంచీ ఎరుగుదును అంబానీ సోదరులు ఇద్దరూ నాకు సమానమే, మత మధ్య విభేదాల్ని పరిష్కరించుకోవాలని భావిస్తాను' అని పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 29 August, 2009
|