దూబే అతీతుడా? దీంతో గతంలో తెలుగుదేశం హయాంలోనే రద్దు చేసిన ఆర్డర్లీ వ్యవస్థ పోలీసుల్లో కొనసాగడంపై పలు విమర్శలు చెలరేగడంతో ప్రభుత్వం వేగంగా స్పందించింది. వివేక్ దూబే, ఎపీ ఎస్పీ కమాండెంట్ అబ్రహంలింకన్ ను సస్పెండ్ చేసింది. దాంతో పాటు విచారణ పూర్తి అయ్యేవరకు హైదరాబాద్ ను వీడి వెళ్ళరాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విచారణ బృందం వచ్చిన సమయంలో అదనపు డీజీపీ దూబే హైదరాబాద్ లో లేకపోవడం పట్ల పలు వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. 'ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్దంగా దూబే ఎలా వ్యవహరించగలరు, ఆయన్ని తక్షణమే వెనక్కి పిలిపించాలి, నగరంలో ఉండేలా చూడాలి' అని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పోలీసు అధికారుల్లో దూబే పట్ల సానుభూతి ఉందనేందుకు సందేహించాల్సిన పని లేదు. ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వుల పట్ల వీరు అసంతృప్తిగా ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సస్పెండ్ ఉత్తర్వు జారీ చేయడమంటే కానిస్టేబుల్ మృతికి దూబేను పరోక్ష బాధ్యుడ్ని చేయడమే అనే భావన ఉంది. 'ఉన్నత స్థాయి పోలీసు అధికారిని సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి. ఒకవేళ దూబే స్థానంలో ఐఏఎస్ అధికారి ఉన్నట్లయితే ఏ చర్యా ఉండేది కాదు' అని ఒక సీనియర్ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు.
కానిస్టేబుల్ మురళీనాథ్ మృతి కేసులో ముఖ్యమంత్రి వైఎస్ నేరుగా జోక్యం చేసుకుని దూబే సస్పెన్షన్ కు ఆదేశించారని తెలుస్తోంది. ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న డీజీపీ యాదవ్ దూబే సస్పెన్ష్ ను గురించి టీవీ వార్తల ద్వారా తెలుసుకున్నారని సమాచారం. మృతుడు మురళీనాథ్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత మధ్యప్రదేశ్ విచారణ బృందం తిరుగుముఖం పడుతోంది. కమాండెంట్ అబ్రహం లింకన్ చెప్పిన విషయాలను వారు నమోదు చేసుకున్నారు.
Pages: -1- 2 News Posted: 31 August, 2009
|