ఇస్రో చంద్ర `గ్రహణం'
కాగా ఈ మిషన్లో పాల్గొన్న భారత్, స్వీడన్, ఇంగ్లాండ్,అమెరికా శాస్త్రవేత్తలు మాత్రం చంద్రయాన్-1 కక్ష్యను ఎందుకు మార్చారో అర్ధం కాలేదని వ్యాఖ్యానించారు. ఒక నెల రోజుల వరకూ ఇస్రో ఎంచేస్తోందో తమకు తెలియలేదని వారు అన్నారు. కాగా చంద్రయాన్-1 గురించి గాని ఇతర ప్రాజెక్టులను గురించి గాని ఎలాంటి ప్రకటనలు బహిరంగంగా చేయరాదని ఇస్రో గత మే నెలలో ఆదేశించిందని ఓ సీనియర్ శాస్త్రజ్ఞడు వెల్లడించారు. అలానే అంతరిక్షనౌక చక్కగా ఉందని, కేవలం చంద్రని ఆకర్షణ శక్తిని అంచనా వేయడానికే కక్ష్యను మార్చామని కూడా అధికారులు చెప్పారని వివరించారు. నిజానికి చంద్రయాన్-1 నౌకను నియంత్రిస్తున్న గ్రౌండ్ ఇంజనీర్లు మాత్రం అప్పటికే దానితో సంబంధాలను దాదాపు కోల్పోయారని చెబుతున్నారు.
నౌక స్థితిగతులను గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపించే ఎలక్ట్రానిక్ నేత్రమైన స్టార్ సెన్సార్ దెబ్బతినిపోయింది. దాంతో క్లిష్టమైన మరమ్మతులను చేయడానికి నౌక ఎంటెన్నాను భూమి వైపు ఉండేలా చేశారు. అంతకంటే నౌక గురించి తెలుసుకోడానికి మరో మార్గమే లేదు. ఇది జూలై 17 వ తేదీనే చోటు చేసుకుంది. 380 కోట్ల రూపాయల ప్రజాధనంతో చేపట్టిన చంద్రయాన్-1 గురించి వాస్తవాలను మరుగుపరచవలసిన అవసరం ఏమిటని సీనియర్ అధికారులు అంటున్నారు. వాస్తవానికి ఇస్రో గర్వించదగిన ప్రాజెక్టు ఇదని, అంచనాల కంటే బాగా పనిచేసిందని, కాని దాని వైఫల్యం గురించి రెండు నెలలు మాట్లాడకుండా ఉండటం అసమంజసమని వారు అభిప్రాయపడ్డారు.
చంద్రయాన్-1 చక్కగా పనిచేసిందని 95 శాతం విధులను పూర్తి చేసిందని, అంతేకాక దానిని విజయవంతంగా చంద్రుని కక్ష్య లోనికి ప్రవేశపెట్టడమే పెద్ద విజయమని ఓ శాస్త్రవేత్త చెప్పారు. చాలా అభివృద్ధి చెందిన దేశాలే చంద్రుని కక్ష్యలోకి నౌకలను పంపడంలోనే విఫలమయ్యాయని ఆయన గుర్తు చేసుకున్నారు. చంద్రయాన్-1 ఉనికిని కనిపెట్టవలసిందిగా శక్తివంతమైన రాడార్ వ్యవస్థలు ఉన్న అమెరికా, రష్యా దేశాలను ఇస్రో కోరిందని, ఇది కేవలం దానిని గమనించడానకే తప్ప పరిశోధనకు పనికి రాదని చెప్పారు.
Pages: -1- 2 News Posted: 31 August, 2009
|